YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

పింకీ లాల్వానీతో మాల్యా మూడో పెళ్లి 

పింకీ లాల్వానీతో మాల్యా మూడో పెళ్లి 

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిన పింకీ లాల్వానీ ని  కింగ్‌ఫిషర్స్ మాజీ అధినేత విజయ్ మాల్యా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.మాల్యా మూడేళ్లుగా పింకీతో డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యా ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమయ్యారు. భారత్ నుంచి పారిపోయి లండన్‌లో తలదాచుకున్న మాల్యాకు పింకీ అండగా నిలిచింది. మాల్యా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పింకీ అన్నీ తానై వ్యవహారాలు చక్కబెట్టింది. ఈ క్రమంలోనే పింకీని మాల్యా వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.కాగా, 62 ఏళ్ల మాల్యాకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తాజా ప్రచారం నిజమైతే.. మాల్యాకు ఇది మూడో వివాహం అవుతుంది. మాల్యా తొలుత ఎయిర్ ఇండియా ఎయిర్‌హోస్టెస్ సమీరా త్యాబ్జీని పెళ్లి చేసుకున్నారు. వీరి కుమారుడే బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మాల్యా. ఆ తరువాత తన చిన్ననాటి స్నేహితురాలు రేఖా మాల్యాను రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా పింకీ లాల్వానీ మూడో పెళ్లి చేసుకోబోతున్నారు.

Related Posts