కోడుమూరు గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరీ దేవి తిరునాలు
కోడుమూరు ఫిబ్రవరి 8
కోడుమూరు గ్రామంలో తేరు బజార్ నందు వెలసిన గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి మాఘ కృష్ణ పాడ్యమి అనగా ఆదివారం నాడు రథోత్సవం జరుగునని ఆలయ నిర్వాహకులు కే శేఖర్ విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం రోజున శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి కి తిరుణాల సందర్భంగా మేజర్ గ్రామ పంచాయతీ తరపున ఈవో వెంకటేశ్వర్లు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అని ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ రథోత్సవానికి కోడుమూరు చుట్టుపక్కల కాక జిల్లా నలుమూలలా అమ్మవారి జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి జాతర జరుపుతారని తెలిపారు తదుపరి మాఘ కృష్ణ విధేయ సోమవారంరోజున తిరుగు రథోత్సవము, మంగళవారం నాడు పారువేట కార్యక్రమం బుధవారం వసంతోత్సవం కార్యక్రమం ఉంటుందన్నారు శ్రీదేవి ఉత్సవాలకు ప్రజలు విచ్చేసి సదరు ఉత్సాహ ములతో నేత్ర ఆనందముగా తిలకించి అమ్మవారి కృపకు పాత్రులగుదురు అని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు పూజారి రాజు దివాకర్ శంకరయ్య సురేంద్ర రాజశేఖర్ గజేంద్ర నాగప్ప రాఘవేంద్ర విరుపాక్షి గిరి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిఐ పార్థసారధి రెడ్డి ఎస్సై మల్లికార్జున పోలీస్ సిబ్బంది బందోబస్తు మధ్య రథోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు