YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 మహిళలకు జీరో వడ్డీలు

 మహిళలకు జీరో వడ్డీలు

 మహిళలకు జీరో వడ్డీలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 8
రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం.. ప్రత్యేక యాప్‌ను లాంఛ్ చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన జగన్.. మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో ఎదగాలన్నారు.. అంతేకాదు ఓ శుభవార్త చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలిస్తామని.. త్వరలోనే ఈ పథకానికి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి తెలిపారు. దివంగత నేత, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ పథకాన్ని అమలు చేశారని.. తర్వాత వచ్చిన ప్రభుత్వం రుణాలు నిలిపివేసిందన్నారు. ఇక పిల్లలకు మేనమామలా అండగా ఉంటానని.. అందుకే 42 మంది లక్షల తల్లులకు అమ్మఒడి అందించామన్నారు.ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని.. నామినేటెడ్‌ పదవులు, పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చామని గుర్తు చేశారు. మహిళల భద్రత కోసమే దిశ చట్టాన్ని తీసుకొచ్చామని.. ఈ నెలాఖరులోపు 18 దిశ పీఎస్‌లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Related Posts