YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విదేశీయం

పాక్ లో మైనర్ బాలికల పెళ్లి

పాక్ లో మైనర్ బాలికల పెళ్లి

పాక్ లో మైనర్ బాలికల పెళ్లి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 
14 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లి, బలవంతంగా మతమార్పిడి చేసి పెళ్లి చేసుకుంటే..? ఆ పెళ్లి చెల్లుబాటు అవుతుందా? మన దేశంలోనైతే కచ్చితం కాదు. బాలికను అపహరించి, బలవంతంగా పెళ్లి చేసుకున్నందుకు కేసు కూడా నమోదు చేస్తారు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా దాదాపుగా ఇలాగే వ్యవరిస్తారు. కానీ ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్‌లో మాత్రం మైనర్ బాలికను ఎత్తుకెళ్లి, మతం మార్చి బలవంతంగా పెళ్లాడినా సరే.. ఆ పెళ్లి చెల్లుబాటు అవుతుంది. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే. సాక్షాత్తూ సింధు హైకోర్టు ఈ తరహా తీర్పు ఇచ్చింది.గత ఏడాది అక్టోబర్లో ఓ క్రిస్టియన్ బాలికను అపహరించిన ఓ వ్యక్తి బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. షరియా చట్టం ప్రకారం ఆ పెళ్లి చెల్లుబాటు అవుతుందని సదరు కోర్టు తీర్పు ఇచ్చింది. మొదటి నెలసరి వచ్చింది కాబట్టి మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం సరైందేనని న్యాయస్థానం తెలిపింది. సింధ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఆ బాలిక పేరెంట్స్ సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు.బాలిక వయసెంతో నిర్ధారించడం కోసం పరీక్షలు నిర్వహించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అదే సమయంలో షరియా చట్టం ప్రకారం పెళ్లి చెల్లుబాటు అవుతుందని న్యాయమూర్తులు మహ్మద్ ఇక్బాల్ కల్హోరో, ఇర్షాద్ అలీ తీర్పు వెలువరించారు. సింధు ప్రావిన్స్‌లో హిందు, క్రిస్టియన్ మైనర్ అమ్మాయిలను బలవంతంగా పెళ్లిళ్లు చేసుకోవడం కోసం సాధారణంగా మారింది. దీంతో ఈ బలవంతపు పెళ్లిళ్లకు అడ్డుకట్ట వేయడం కోసం 2014లో సింధ్ బాల్య వివాహల నిరోధక చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం బాలికలకు 18 ఏళ్లలోపు వివాహం చేయకూడదు.గత నెలలో ఇదే ప్రావిన్స్‌లో ఇద్దరు హిందు అమ్మాయిలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి పెళ్లి చేసుకున్నారు. పాకిస్థాన్‌లో మైనార్టీ అమ్మాయిల బలవంతపు పెళ్లిళ్లపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది

Related Posts