YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఏపీలో యువకులకు కిరెక్కింది 

Highlights

  • జేఏసీ‌గా విద్యార్థి, యువజన సంఘాలు 
  • ఏప్రిల్ 6 నుంచి ఉద్యమ బాటలో  విద్యార్థులు
ఏపీలో యువకులకు కిరెక్కింది 

ఆంధ్ర ప్రదేశ్ లో  ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం వివిధ రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తుకుంటూ మల్లగులాపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికీ వారు ఈ అంశంలో తమదే పైచేయి కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని పార్టీలు యువకులు, విద్యారులకు కిరెక్కించారు. ఇక చూసుకోండి పరీక్షల సమయంలో విద్యార్థులు రోడ్డెక్కేందుకు సమాయత్తమవుతున్నారు.  ఇందులో భాగంగా  విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ‌గా ఆవిర్భవించాయి. అంటే కాదు విజయవాడలో 25 విద్యార్థి, యువజన సంఘాల నేతలు కలిసి ఓ  సమావేశాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 6 నుంచి యూనివర్సిటీ, కళాశాల విద్యార్థులు ఉద్యమంలో పాల్గొనేలా కార్యచరణ రూపొందించారు. నాలుగేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై నిర్లక్ష్యం చేయడం, ప్యాకేజీ పేరుతో ఏపీ ప్రజల్ని ఫూల్స్ చేశారని విద్యార్థి, యువజన సంఘాల నేతలు అన్నారు. ఏప్రిల్ 1న ఫూల్స్ కేండిల్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ఈ ఉద్యమంలో ఇప్పుటి వరకూ కొన్ని పార్టీలు, ప్రజాసంఘాల్లోని కేడర్ మాత్రమే పాలు పాలుపంచుకుంటున్నారని, ఈ ఉద్యమాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లాలనేదే తమ ప్రధానమైన నినాదమని చెప్పారు. 

Related Posts