YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వసూళ్ల పర్వం (పశ్చిమగోదావరి)

వసూళ్ల పర్వం (పశ్చిమగోదావరి)

 వసూళ్ల పర్వం (పశ్చిమగోదావరి)
ఏలూరు, ఫిబ్రవరి 08 జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో వసూళ్ల పర్వం సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మఒడి నగదు నుంచి పాఠశాల పారిశుద్ధ్య నిర్వహణ కోసం రూ.వెయ్యి నగదు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీంతో ఈ నిబంధన తమకు కూడా వర్తిస్తుందని ప్రైవేటు పాఠశాలలూ విద్యార్థుల నుంచి వసూళ్లు మొదలు పెట్టాయి. విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడం ఆరంభించాయి. ఎందుకని ప్రశ్నించిన విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశం అని బదులిస్తున్నారు. ఉంగుటూరు, గోపాలపురం పరిధిలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల యజమానులు ఒక్కో విద్యార్థిని రూ.1000 తీసుకురావాలని చెప్పారు. పాఠశాల అభివృద్ధి కోసం ఈ నగదు వినియోగిస్తామని విద్యార్థులకు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి నగదు తీసుకుని పాఠశాల యాజమాన్యానికి చెల్లించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. అధిక విద్యుత్తు వాడకం, కారు, భూములు, ఆదాయపు పన్ను వంటి మినహాయింపులతో చాలామంది తల్లులు అమ్మఒడికి దూరమయ్యారు. ఇప్పుడు లబ్ధిపొందిన తల్లుల ఖాతాల్లో జమైన రూ.15 వేలల్లో రూ.1000 పాఠశాల తల్లిదండ్రుల కమిటీకి జమ చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సొమ్ముతో పారిశుద్ధ్య పనుల నిర్వహణతో పాటు సిబ్బంది వేతనాలకు వెచ్చించాలన్నది ఉత్తర్వులోని సారాంశం. ఇదే అదనుగా జిల్లాలోని చాలా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి రూ.1000 వసూలు చేస్తున్నాయి. నగదు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నాయి. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.1000 వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆసరాగా చేసుకుని జిల్లాలోని చాలా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నగదు తీసుకురావాలని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయని సమాచారం. ప్రైవేటు పాఠశాలలో సాధారణంగా పాఠశాల నిర్వహణకు సంబంధించిన వసతులన్నీ యాజమాన్యం సొంత నిధులతో సమకూర్చుకోవాలి. తమ అవసరాలకు కావాల్సిన మొత్తాన్ని విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో ముందుగానే కట్టించుకుంటారు. ఇవి కూడా చాలవన్నట్లు ప్రభుత్వం అమ్మఒడి నిమిత్తం వేసిన నగదులో కూడా కొంత వసూళ్లకు పాల్పడుతున్నాయి. అమ్మఒడి వస్తుందన్న ఉద్దేశంతోనే చాలామంది విద్యార్థులను యాజమాన్యాలు ఫీజు విషయంలో ఒత్తిడి చేయలేదు. తీరా వచ్చిన మొత్తాన్ని ఫీజుల రూపంలో వసూలు చేశారు. ఇప్పుడు మళ్లీ నగదు తీసుకురమ్మంటే చాలామంది తల్లిదండ్రులు తమ జేబులో సొమ్ము చెల్లిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నగదు వసూలు చేస్తున్నారు. ప్రశ్నించిన వారికి కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పాఠశాల అభివృద్ధి కోసం అని, మరికొన్ని చోట్ల ప్రభుత్వ ఆదేశాలని బదులిస్తున్నారు. వచ్చిన ఉత్తర్వుల్లో ఎక్కడా ఇది ప్రైవేటు పాఠశాలలకు వర్తించదని చెప్పలేదు. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు వసూళ్లకు పాల్పడుతున్నాయి.

Related Posts