YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 ఇసుకెక్కడ..? (తూర్పుగోదావరి)

 ఇసుకెక్కడ..? (తూర్పుగోదావరి)

 ఇసుకెక్కడ..? (తూర్పుగోదావరి)
కాకినాడ, ఫిబ్రవరి 08 ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన ఇంటి వద్దకే ఇసుక సరఫరా కార్యక్రమానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. జిల్లాలో జనవరి 17 నుంచి ఈ పథకం ప్రారంభమైనా, వినియోగదారుల ఇంటికి ఇసుకను చేర్చే పరిస్థితి కనిపించడం లేదు. రవాణా ఛార్జీలు ఆన్‌లైన్‌లో జమ చేస్తుండడం, చెల్లిస్తున్న మొత్తం గిట్టుబాటు కాదన్న వాదనతో లారీలు, ట్రాక్టర్ల ..మిగతా 7లోయజమానులు ఇసుక రవాణాకు ససేమిరా అంటూ సహాయ నిరాకరణకు దిగారు. దీంతో రేవుల్లో ఇసుక తవ్వకాలకు కార్మికులు అందుబాటులో ఉన్నా నిర్దేశిత ప్రదేశాలకు ఇసుకను చేర్చే దారిలేక అవి మూతపడ్డాయి. పెద్ద సంస్థలు, ప్రభుత్వ అవసరాలకు ప్రత్యేక వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నా.. సామాన్యులకు సంబంధించి గృహనిర్మాణాలు, ఇతర అవసరాలకు మాత్రం ఇసుక అందుబాటులో ఉండని పరిస్థితి జిల్లాలో నెలకొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో ముఖ్య రేవుల్లో ఇసుక తవ్వకాలకు కొంత విరామం ఏర్పడగా..డ్రైవర్లు, యజమానుల ఆందోళన నేపథ్యంలో అనంతరం కూడా ఈ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. క్షేత్ర స్థాయిలో సమస్య జఠిలం కావడంతో జిల్లా ఉన్నతాధికారులు పరిష్కారం దిశగా చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో 54 చోట్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు యంత్రాంగం గుర్తించింది. వీటిలో 33 రేవులు కాగా..మిగిలినవి పట్టా భూములు.ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఓపెన్‌ రీచ్‌లు 23 ఉండగా.. లీజుకు తీసుకున్నవి నాలుగు ఉన్నాయి. మిగిలినవన్నీ పట్టా భూముల్లోనివి కావడం గమనార్హం. ఇసుక పాలసీపై నిర్ణయం వెలువడడానికి కొంత కాలం, ఇసుక సరఫరాను గాడిలో పెట్టేందుకు మరికొన్ని రోజులు పట్టడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు తీవ్రమయ్యాయి. తాజాగా వినియోగదారుని ఇంటికే ఇసుకను సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఊరటనిచ్చినా..క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చక్కదిద్దితేగానీ ఇది అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా కొనుగోలుదారు ఇంటి వద్దకే ఇసుకను సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీఎండీసీ పోర్టల్‌లో డబ్బు చెల్లిస్తే 72 గంటల్లో ఇసుక ఇంటికే సరఫరా అయ్యే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల వినియోగదారుడికి రవాణా ఛార్జీల భారం తగ్గుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. ఏపీ శాండ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని.. లేదంటే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని శాండ్‌ సేల్‌ మేనేజ్‌మెంట్‌, మోనటరింగ్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎస్‌ఎంఎంఎస్‌)లో వినియోగదారుడు లాగిన్‌ అవ్వాలి. ఎంత ఇసుక కావాలో పేర్కొంటూ.. అందుకు తగిన మొత్తం చెల్లించాలి. ఈ సమాచారం ఆధారంగా రేవుల్లో ఇసుకను వాహనాల్లోకి ఎక్కించి లబ్ధిదారుడు కోరిన చోటుకు చేరవేస్తారు. ఇంతవరకు బాగున్నా.. ఈ ప్రక్రియ అమలులో ఆటంకాలు ఎదురవుతున్నాయి. రవాణా ఛార్జీల విషయంలో ట్రాక్టర్లు, లారీల యజమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలుదారు అభ్యర్థన అనంతరం జీపీఎస్‌ ద్వారా వారి చరవాణిలకు వస్తున్న రవాణా సందేశాలను ట్రాక్టర్లు, లారీల యజమానులు తిరస్కరిస్తున్నారు. దీంతో ప్రజలకు ఇసుక అందని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 1500 లారీలు ఉండగా కేవలం 15 లారీలే ఇసుక రవాణాకు సహకరిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. జిల్లాలో 17 వేలకు పైగా ట్రాక్టర్లు ఉన్నాయి. వీటిలో ఇసుక తరలింపునకు నిర్దేశించిన వాహనాల పరిస్థితీ దాదాపుగా ఇలాగే ఉంది.

Related Posts