YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ఈ 3 పనులు చేస్తే.. స్వర్గానికి దారి దొరుకుతుంది!

ఈ 3 పనులు చేస్తే.. స్వర్గానికి దారి దొరుకుతుంది!

ఈ 3 పనులు చేస్తే.. స్వర్గానికి దారి దొరుకుతుంది!
మనం భూమి మీద చేసే పనులను బట్టి స్వర్గానికి వెళ్తారా లేదా నరకానికి వెళ్తారా అనేది తెలుస్తుంది.  భూమి మీద మనం మంచి పనులు చేస్తూ.. పెద్దలను గౌరవిస్తూ.. చనిపోయిన వ్యక్తులకు శ్రాద్ద ఖర్మలు నిర్వహిస్తే.. వారికి తప్పకుండా పుణ్యలోకాలు లభిస్తాయి. 
ఇక మనిషికి స్వర్గంలో  స్థానం లభించాలి అంటే ఏం చేయాలి.  ఎలా చేస్తే స్వర్గం లభిస్తుంది.  అనే విషయాల గురించి తెలుసుకుందాం.  మహాభారతంలో స్వర్గంలోకంలో స్థానం లభించాలి అంటే.. మూడు రకాల రుణాలను తీర్చుకోవాలి.  ఆ మూడు రకాల రుణాల గురించి మహాభారతంలో చక్కగా వివరించారు.  ఆ మూడు రకాల రుణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.  
1. దేవరుణం : మ‌నిషి  జీవించి ఉన్నంత కాలం దాన ధ‌ర్మాలు చేయాలి.  దానధర్మాలు చేస్తే.. మనిషికి పుణ్యం లభిస్తుంది.  భూమి మీద ఉన్నప్పుడు తమ దగ్గర ఉన్న వాటిని ఇతరుల అవసరాలకు ఉపయోగించాలి.  ఇలా చేయడం కుదరని పక్షంలో,  అలా చేయ‌లేని వారు ఒక వేళ చ‌నిపోతే వారి కుటుంబ స‌భ్యులెవ‌రైనా శ్రాద్ధ క‌ర్మ‌లు చేస్తే అప్పుడు ఆ రుణం తీర్చుకున్న‌ట్టై  అవుతుంది.  వారికి మంచి లోకాలు ప్రాప్తిస్తాయి.  
2.  ఋషి రుణం : మ‌నిషి బ‌తికి ఉన్న‌ప్పుడు తాను సంపాదించే జ్ఞానాన్ని ఇత‌రుల‌కు పంచితే ఈ రుణం తీర్చుకున్న‌ట్టు అవుతుంద‌ట‌. ఇక పైన చెప్పిన‌ట్టుగా ఒక వేళ ఎవ‌రైనా ఇలా కూడా చేయ‌లేక‌పోతే వారు చ‌నిపోయాక వారి కుటుంబ స‌భ్యులు శ్రాద్ధ క‌ర్మ‌లు నిర్వ‌హిస్తే అప్పుడు ఈ రుషి రుణం కూడా తీరిన‌ట్టు అవుతుంది
3. పితృరుణం : ఈ రుణం తీరాలంటే మాత్రం చ‌నిపోయిన వారికి క‌చ్చితంగా శ్రాద్ధ క‌ర్మ‌లు నిర్వ‌హించి త‌ర్ప‌ణాలు, పిండ ప్ర‌దానాలు చేయాల్సిందేన‌ట‌. అప్పుడే 3 రుణాలు తీరిన‌ట్ట‌యి చ‌నిపోయిన వారి ఆత్మ శాంతిస్తుంద‌ట‌. భూమిపై నివ‌సించే వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా మంచి జ‌రుగుతుంద‌ట‌. అందుకే ఎవ‌రైనా త‌మ పూర్వీకుల‌కు శ్రాద్ధ క‌ర్మ‌లు నిర్వ‌హించ‌కుండా చ‌నిపోతే, వారి పేరిట ఇప్పుడున్న‌వారు త‌మ పూర్వీకుల‌కు శ్రాద్ధ కర్మ‌ల‌ను నిర్వ‌హించాల‌ట‌. అలా చేసినా చ‌నిపోయిన వారి ఆత్మ‌లు శాంతించి, ఇప్పుడున్న వారికీ మంచి జ‌రుగుతుంద‌ట‌. 
ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పిన‌ మూడింటిని ఎవరైతే సక్రమంగా నిర్వహిస్తారో.. వారికి స్వర్గలోకంలో స్థానం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి...

Related Posts