YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పత్తిపాటి, నారాయణలకు బిగిస్తున్న ఉచ్చు

పత్తిపాటి, నారాయణలకు బిగిస్తున్న ఉచ్చు

పత్తిపాటి, నారాయణలకు బిగిస్తున్న ఉచ్చు
విజయవాడ, ఫిబ్రవరి 10,
అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయారు. రాజధాని అమరాతిలో వారు చెప్పిందే వేదం. భూములు కొనాలన్నా, అమ్మాలన్నా డిసైడ్ చేయాల్సింది వీరే. వారే మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ. అమరావతిని రాజధానిగా నిర్ణయించే నాటి నుంచి ప్రతి పనిలోనూ వీరిద్దరి ప్రమేయం ఉందన్నది వాస్తవం. అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి వీరు టార్గెట్ గా మారారు. అమరావతి రాజధాని భూ కుంభకోణంలో వీరిద్దరిపై సీఐడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కూడా దృష్టిపెట్టారు.నిజానికి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలు సైలెంట్ గానే ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెదవి విప్పలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. సొంత వ్యాపార కార్యక్రమాల వరకే వీరు పరిమితమయ్యారు. ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రతిపాదనను వైసీీపీ ప్రభుత్వం తెరమీదకు తెచ్చిన తర్వాతనే వీరు తిరిగి పార్టీలో యాక్టివ్ గా మారారు. అప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు యాక్టివ్ గా మారడానికి ప్రధాన కారణం రాజధాని ప్రాంతంలో ఇద్దరికీ పెద్దయెత్తున భూములు ఉండటమేనన్న విమర్శలు కూడా లేకపోలేదు.నారాయణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. అందుకే ఆయనను ఎమ్మెల్సీ చేసి మరీ చంద్రబాబు మంత్రిని చేశారు. ఆయనకు మున్సిపల్ శాఖతో పాటు కీలకమైన సీఆర్డీఏ బాధ్యతలను కూడా అప్పగించారు. దీంతో నారాయణ రాజధాని అమరావతి విషయంలో తీసుకున్న ప్రతి నిర్ణయం వెనక చంద్రబాబు ఉన్నారన్నది ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది. అలాగే ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబుకు బినామీగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా పాలకపక్షం చేస్తోంది.ఇప్పటికే రాజధాని భూముల్లో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ సీఐడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తెల్లకార్డు రేషన్ దారులతో భూములు కొనుగోలు చేయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో నారాయణ, ప్రత్తిపాటిపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు వెంకటపాలెంకు చెందిన దళిత మహిళ ఒకరు తమ భూములు కాజేశారని ఫిర్యాదు చేయడంతో అదో కేసు నమోదయింది. త్వరలోనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఇద్దరిపై దాడులు చేస్తుందన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. అందుకే రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ నిన్నటి వరకూ హడావిడి చేసిన పుల్లారావు మళ్లీ సైలెంట్ అయ్యారంటున్నారు. నారాయణ కూడా బిక్కు బిక్కుమంటూ ఎప్పుడు ఏ కేసు నమోదవుతుందోనన్న భయంతో ఉన్నారంటున్నారు. మొత్తం మీద అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చలాయించిన ఈ నేతలిద్దరిపైనే ఎక్కువగా అధికార పార్టీ ఫోకస్ పెట్టినట్టుం

Related Posts