YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పీకల్లోతు కష్టాల్లో జేసీ

పీకల్లోతు కష్టాల్లో జేసీ

పీకల్లోతు కష్టాల్లో జేసీ
అనంతపురం, ఫిబ్రవరి 10,
జేసీ దివాకర్ రెడ్డి మాటలే ఆయనకు చేటు తెస్తున్నట్లుంది. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన జేసీ సోదరులకు ఇప్పుడు చుక్కలు కన్పిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జేసీ దివాకర్ రెడ్డి తీరు మార్చుకోలేదు. జగన్ త్వరలోనే జైలుకు వెళతారని జోస్యం చెబుతన్నారు. వైఎస్ భారతి ముఖ్యమంత్రి కాబోతున్నారని జేసీ ప్రకటిస్తున్నారు. ఇక జగన్ ప్రభుత్వంపైనా, వ్యక్తిగతంగానూ జేసీ దివాకర్ రెడ్డి విమర్శలకు కొదవలేదు.అయితే గత కొంతకాలంగా జేసీ దివాకర్ రెడ్డి వ్యాపారాలపై జగన్ ప్రభుత్వం కన్నెర్ర చేసిందనే చెప్పాలి. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సులను దాదాపుగా సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని కేసులు మీద కేసులు పెడుతున్నారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి ఒక దశలో తాము ట్రాన్స్ పోర్టు వ్యాపారం నుంచి తప్పుకుంటామని కూడా ప్రకటించారు. అయినా బస్సుల సీజ్ ఆగలేదు. దీనిపై జేసీ కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.తాజాగా జేసీ ట్రావెల్స్ కు చెందిన కొన్ని లారీలను బెంగుళూరులో కొందరికి విక్రయించారు. అయితే ఎన్వోసీ తీసుకునే విషయంలో తాడిపత్రి ఎస్ఐ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. దీనిపై విచారణ సాగుతోంది. ఈ కేసులో జేసీ సోదరులు ఇరక్కునే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరింత ఉచ్చు బిగించే దిశగా కేసును పకడ్బందీగా రూపొందించారు.మరోవైపు బీఎస్-3 వాహనాల విక్రయం కూడా జేసీ సోదరుల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. 2017 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీఎస్-3 వాహనాలను నిషేధించింది. ఈ వాహనాలను విక్రయించకూడదు. బీఎస్ –4 వాహనాలను మాత్రమే విక్రయించాల్సి ఉంది. కానీ దాదాపు 68 బీఎస్-3 వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా జేసీ సోదరులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ఈ వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా బీఎస్ –4 గా మార్చారు. ఈ వాహనాలు జేసీ అనుచరుడు గోపాల్ రెడ్డి పేరు మీద ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. ఈ ఒక్క కేసులోనే వంద కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే జేసీ కుటుంబం ఆర్థికంగా చితికిపోయినట్లే.

Related Posts