YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 స్టాలిన్ తో దినకరన్ పొత్తు...

 స్టాలిన్ తో దినకరన్ పొత్తు...

 స్టాలిన్ తో దినకరన్ పొత్తు...
చెన్నై, ఫిబ్రవరి 10,
శశికళ మేనల్లుడు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ అధ్యక్షుడు టీటీవీ దినకరన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం కల్గిస్తున్నాయి. ఒక వివాహ వేడుకకు హాజరైన దినకరన్ అక్కడే ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. స్టాలిన్ నాయకత్వం తమిళనాడుకు అవసరమని దినకరన్ అన్నారు. అంతేకాదు తమిళనాడు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. స్టాలిన్ కు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని దినకరన్ అభిప్రాయపడ్డారు.అంతేకాదు పరోక్షంగా దినకరన్ రజనీకాంత్ పై వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రం నుంచి తమిళనాడును పాలించాలని అనుకుంటున్నారని, అది సాధ్యం కాదని దినకరన్ చెప్పడం చూస్తుంటే భవిష్యత్తులో తమిళ రాజకీయాలు మరింతగా మారే అవకాశమున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దినకరన్ ఆర్కే పురం ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు. మేనత్త శశికళ ఆశీర్వాదంతోనే పార్టీని పెట్టారు.శశికళ జైలులో ఉండటంతో ఇటీవల జరిగిన ఎన్నికలను ఆయనే పర్యవేక్షించారు. అయితే పార్లమెంటు, శాసనసభ ఉప ఎన్నికల్లో దినకరన్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం సత్తా చాటిందనే చెప్పాలి. డీఎంకే, అన్నాడీఎంకే తర్వాత స్థానంలో దినకరన్ పార్టీ ఉంది. దీంతో దినకరన్ పొత్తు దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే నుంచి తమను బహిష్కరించడంతో స్టాలిన్ తో జత కట్టే అంశాన్ని దినకరన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఈ ఏడాది మార్చి నెలలో శశికళ జైలు నుంచి పెరోల్ పై బయటకు రానున్నారు. శశికళ సోదరుడు దివాకరన్ కుమారుడి వివాహం కోసం ఆమె పెరోల్ పై బయటకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పొత్తుల విషయంపై శశికళ చర్చలు జరుపుతారన్న టాక్ తమిళ రాజకీయాల్లో బలంగా విన్పిస్తుంది. జయలలితకు ప్రధాన శత్రువుగా ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ ను పొగడటం చూస్తుంటే దినకరన్ అడుగులు డీఎంకే వైపు పడుతున్నట్లు చెబుతున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ మాత్రం దినకరన్ వ్యాఖ్యలు చూసి నవ్వుకున్నారు. అయితే పొత్తు పెట్టుకోకుండా దినకరన్ పార్టీని ఒంటరిగా పోటీ చేయించి అధికార అన్నాడీఎంకే పార్టీ ఓట్లు చీల్చాలన్న వ్యూహంలో స్టాలిన్ ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts