YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఏడు నెలల్లో  కనిపించని ఎంపీ

 ఏడు నెలల్లో  కనిపించని ఎంపీ

 ఏడు నెలల్లో  కనిపించని ఎంపీ
ఏలూరు, ఫిబ్రవరి 10,
వైసీపీకి చెందిన పార్లమెంటుసభ్యుడు కోటగిరి శ్రీధర్ ఎక్కువగా అమెరికాలోనే ఉంటారు. ఆయన నియోజకవర్గం, ఢిల్లీలో కన్నా అమెరికాలో గడిపే సమయే ఎక్కువని చెప్పక తప్పదు. దీంతో పార్లమెంటు సభ్యుడిని కలవాలంటే ఇక్కడ కుదరి పనే. ఏలూరు ఎంపీగా ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కోటగిరి శ్రీధర్ అప్రదిష్టను మూటగట్టుకుంటున్నారు. ప్రజలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.కోటగిరి విద్యాధరరావు, ఏలూరు ప్రాంతంలో కోటగిరి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దానికి కారణం కోటగిరి విద్యాధరరావు. మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన కోటగిరి విద్యాధరరావు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆయన జిల్లా రాజకీయాలను శాసించారు. ఆయన మరణంతో రాజకీయాల్లోకి కోటగిరి శ్రీధర్ వచ్చారు. అమెరికాలో ఉంటున్న కోటగిరి శ్రీధర్ ఇక్కడకు వచ్చి 2014లో బీజేపీలో చేరారు.ఆ తర్వాత 2017లో వైసీపీలో చేరిపోయారు. వైసీపీలో చేరిన వెంటనే కోటగిరి శ్రీధర్ కు ఏలూరు ఎంపీ సీటు జగన్ హామీ ఇచ్చారు. ఎంపీ సీటు ఇస్తానని చెప్పినా కోటగిరి శ్రీధర్ 2017 నుంచి 2019 వరకూ అమెరికా టూర్లు ఎక్కువగానే వేశారు. అంతే తప్ప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పెద్దగా ప్రజలను పరిచయం చేసుకోవాలన్న ప్రయత్నం కూడా కోటగిరి శ్రీధర్ చేయలేదు. అసలు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం మొత్తం ఒక్కసారి కూడా తిరగలేదంటే కోటగిరి శ్రీధర్ రాజకీయ నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు.ఇక 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏడు నెలలుగా ఎంపీ కోటగిరి శ్రీధర్ నియోజకవర్గ ప్రజలకు కన్పించడం లేదు. ఈ ఏడు నెలల్లోనే రెండు సార్లు కోటగిరి శ్రీధర్ అమెరికా వెళ్లి వచ్చారు. ఇప్పటి వరకూ తన తండ్రి మాదిరిగా ఒక్కసారి కూడా ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టలేదు. అసలు కోటగిరి శ్రీధర్ దొరకడమే కష్టమని నియోజకవర్గ ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. దీంతో ఈ ఎంపీ తమకు అవసరం లేదంటున్నారు ఏలూరు ప్రజలు. ఇప్పటికైనా కోటగిరి శ్రీధర్ నియోజకవర్గం సమస్యలపై దృష్టి సారించకపోతే మాగంటి ఫ్యామిలీ కాచుక్కూర్చుని ఉందంటున్నారు. రాజకీయాల్లో యువకుడిగా శ్రమించాల్సిన కోటగిరి శ్రీధర్ ఇలా వ్యవహరించడాన్ని వైసీపీ నేతలే తప్పుపడుతున్నారు.

Related Posts