YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం విదేశీయం

ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ రికార్డ్

ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ రికార్డ్

ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ రికార్డ్
హైద్రాబాద్, ఫిబ్రవరి 10,
ఇంకా ఈ సినిమాకి టైటిల్‌ని ఫిక్స్ చేయలేదు.. ఫస్ట్ లుక్ లేదు.. హీరోల లుక్స్ లేవు.. ప్రమోషన్స్ పోస్టర్స్ లేవు.. అసలు కథా నేపథ్యం ఏంటన్నదానిపైనా క్లారిటీ లేదు. అయినప్పటికీ ఒకే ఒక్క పేరు ‘RRR’ ఈ సినిమాకు విడుదలకు ముందే కోట్లు కుమ్మరిస్తోంది. రామారావు(R), రామ్ చరణ్(R), రాజమౌళి(R) కాంబో మూవీ రికార్డుల ప్రభంజనం అప్పుడే మొదలైంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో పాత రికార్డుల్ని చెరిపేస్తోంది ‘RRR’. ఆ వివరాల్లోకి వెళ్తే..బాహుబలి’ చిత్రం తరువాత ప్రపంచ స్థాయిలో సినీ అభిమానులు ఎదురుచూస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘RRR’. దర్శక ధీరుడు జక్కన్న చెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా పడిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో స్టార్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కావడంతో కంటెంట్, క్వాలిటీ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గక్కుండా ప్యాన్ ఇండియా చిత్రంగా ‘RRR’ ను రూపొందిస్తున్నారు రాజమౌళి.ఒక్క ఏడాది కాదు.. మరో రెండేళ్లైనా అభిమానులు రాజమౌళి సినిమా నుండి ఏదైతే ఆశిస్తారో అది నూటికి నూరుపాళ్లు తప్పక దొరుకుందనే నమ్మకంతో ఈ సినిమా విడుదల వాయిదా పడినా సినీ ప్రేక్షకులు మాత్రం ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. రామారావు(R), రామ్ చరణ్(R), రాజమౌళి(R) కాంబినేషన్ మూవీ మరోమారు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచంలోని నలుదిశలా వ్యాప్తిచేయడం ఖాయమే అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఈ సినిమా విడుదల తేదీ.. 2021 జనవరి 8. అంటే ఈ సినిమా విడుదలకు మరో ఏడాది సమయం ఉండనే ఉండగా.. అప్పుడు ‘RRR’ రికార్డుల ప్రభంజనం మొదలైంది. ఈ సినిమా కనీసం టైటిల్ ఫిక్స్ కాలేదు.. ఫస్ట్ లుక్ లేదు.. ప్రమోషన్స్ పోస్టర్స్ లేవు.. హీరోలకు సంబంధించిన లుక్‌లు భయటకు రాలేదు.. అయినప్పటికీ ‘RRR’ అనే క్యాంబో.. ఇండియాలోనే ఆల్ టైమ్ టాప్ బిజినెస్‌లో ముందు వరసలో నిలిచేందుకు రెడీ అయ్యింది.తాజాగా ‘RRR’ చిత్రం కళ్లు బైర్లు కమ్మే ప్రీ రిలీజ్ బిజినెస్ సాధిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా పది భాషలలో భారీగా విడుదల కానున్న ఈ మూవీ రికార్డ్ స్థాయిలో బిజినెస్ సాధిస్తోంది. ఒక్క తెలుగులోనే ఈ చిత్రం రూ.270- రూ.300 కోట్ల బిజినెస్ చేసిందని ప్రచారం జరుగుతుంది.

Related Posts