YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ విదేశీయం

రిపబ్లికన్ తరుపున పోటీ చేస్తున్న మంగా

రిపబ్లికన్ తరుపున పోటీ చేస్తున్న మంగా

రిపబ్లికన్ తరుపున పోటీ చేస్తున్న మంగా
హైద్రాబాద్, ఫిబ్రవరి 11,
అమెరికాలో తెలుగించి ఆడపడుచు అరుదైన అవకాశం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగా అనంతాత్ముల.. అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేయనున్నారు. వర్జీనియాలోని 11వ కాంగ్రెస్‌ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. దీంతో  లాంఛనంగా ఆమె ప్రచారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన మంగ పాఠశాల విద్యాభ్యాసం చెన్నైలో సాగింది. ఆగ్రా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1990లలో భర్త, కుమారుడితో కలిసి అమెరికాకు వలస వచ్చారు.రక్షణ కొనుగోళ్ల విభాగంలో ఫెడరల్‌ ప్రభుత్వ కాంట్రాక్టరుగా ఆమె వ్యవహరించారు. డెమోక్రాట్లకు కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి ప్రతినిధుల సభకు పోటీ చేస్తున్న తొలి భారత సంతతి మహిళ మంగా అనంతాత్ముల కావడం విశేషం.మంగా పోటీ చేసే స్థానంలో సంపన్నులు అధికంగా నివసిస్తుంటారు. ఇక్కడ 17 శాతం ఆసియా జనాభా ఉండగా, అందులో 7 శాతం ప్రవాస భారతీయులే ఉండటం గమనార్హం.. సాధారణంగా ఆసియన్ల మద్దతు డెమోక్రటిక్‌ పార్టీకే అయినప్పటికీ, ఈ సారి మార్పు రావొచ్చనే ఆశాభావంతో ఆమె ఉన్నారు. ఆరు సార్లు కాంగ్రెస్‌ సభ్యుడిగా గెలిచిన జెర్రీ కొన్నొల్లీతో నవంబర్‌లో జరుగనున్న ఎన్నికల్లో ఆమె తలపడుతున్నారు

Related Posts