దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు:మంత్రి హర్షవర్దన్
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 10
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. దేశంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. కేరళలో మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు చెప్పారు. ఆ పేషంట్లను క్వారెంటైన్ చేసినట్లు తెలిపారు. కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు మంత్రులతో ప్యానెల్‌ను ఏర్పాటు చేసిట్లు చెప్పారు. చైనా వెళ్లేవారికి వీసాలు ఇవ్వడంలేదన్నారు. ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశామన్నారు. విమానాశ్రయాల్లో యూనివర్సల్ థర్మల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వుహాన్ నుంచి భారతీయ విద్యార్థులను తీసుకువచ్చామన్నారు. చైనాలో కరోనా వల్ల 811 మంది మరణించినట్లు మంత్రి తెలిపారు. భారత్ ఆ వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మొత్తం 1118 విమానాలను స్క్రీన్ చేసినట్లు చెప్పారు.