YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు విస్తృత‌ ఏర్పాట్లు     

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు విస్తృత‌ ఏర్పాట్లు     

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు విస్తృత‌ ఏర్పాట్లు     
తిరుపతి ఫిబ్రవరి 10 
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్ధుతున్నారు. భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ గురువారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.  ఫిబ్రవరి 14వ తేదీ శుక్ర‌వారం ధ్వజారోహణంతో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 9.45 నుండి 10.10 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

Related Posts