YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్పందన అర్జీల పరిష్కారంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో తృతీయ స్థానం

స్పందన అర్జీల పరిష్కారంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో తృతీయ స్థానం

స్పందన అర్జీల పరిష్కారంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో తృతీయ స్థానం
అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ 
కర్నూలు, ఫిబ్రవరి 10 
స్పందన అర్జీల పరిష్కారంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో తృతీయ స్థానం రావడంతో జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ అభినందించారు. సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జయంట్ కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, ట్రైనీ కలెక్టర్ విదేకర్ తో పాటు జెసి - 2 ఖాజామోహిద్దీన్, డిఆర్వో పుల్లయ్య, డిఆర్డిఎ పిడి శ్రీనివాసులు, డిఎస్ ఓ పద్మశ్రీ, డ్వామా పిడి మురళి తదితరులు జిల్లా నలుమూలల ప్రజల నుండి వచ్చిన అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి స్వీకరించిన అనంతరం కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమం పై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు. స్పందన అర్జీల తిరస్కారం కేవలం 9 శాతం మాత్రమే, అన్ని జిల్లాల కంటే కర్నూలు జిల్లా అతి తక్కువ రిజెక్షన్స్  మనమే టాప్ వెరీగుడ్ అన్నారు. స్పందనలో వచ్చిన అర్జీల తిరస్కారం జీరో కావాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ స్పందన నిర్వహించి, ప్రజల నుండి అర్జీలు తీసుకోవాలన్నారు. వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రజలు అర్జీలు తీసుకుని మండలాలకు, జిల్లా కేంద్రానికి వస్తున్నారని  అర్జీ దారుల సంఖ్య తగ్గుముఖం పట్టాలంటే గ్రామ, వార్డు సచివాలయం లో ప్రతిరోజు స్వీకరిస్తే తప్ప జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికి అర్జీదారులు తమ సమస్యలను  విన్నవించదానికి రారు. ఈ నెల 17 న జిల్లాలో పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం పెద్దపాడు లో డా.వైఎస్సార్ కంటి వెలుగు థర్డ్ ఫేజ్ -అవ్వా-తాత లకు- కంటి పరీక్షల కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారని సీఎం పర్యటన ఏర్పాట్లను పగడ్బందీగా చేయాలన్నారు. స్పందన అర్జీల పెండింగ్ సమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీఎంవో ఆఫీస్ నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులుకు కలదన్నారు. స్పందన అర్జీల పరిష్కారంలో వారం రోజుల్లో పరిష్కరించేవి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేవి, ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. సమస్యను తూ తూ మంత్రంగా పరిష్కరించకుండా నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు. మూడు రోజుల వ్యవధి, వారం రోజుల వ్యవధి ఉన్న దరఖాస్తులు అధికంగా పెండింగ్లో ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ ఒక్క దరఖాస్తును చిన్న చిన్న కారణాలతో తిరస్కరించకుండా సమస్య పరిష్కారంపై శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను సులభంగా తిరస్కరించడం వల్ల బాధితుల సమస్యలు బాధలు తొలగిపోవని పరిష్కరించినపుడే సంబంధిత బాధితులకు న్యాయం చేసిన వారమవుతాం అన్నారు. పీఎం మాతృత్వ వందన పథకం అమలులో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి ఇటీవల ఢిల్లీలో కేంద్రమంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ ద్వారా జాతీయ స్థాయి అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ను ఘనంగా సత్కరించిన దళిత సంఘాలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కర్నూలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఓర్వకల్లు, మిడ్తూరు, పాతకోట, పగిడాల పాఠశాలలకు చెందిన విద్యార్థులు మీ టు ది కలెక్టర్  కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పందన కార్యక్రమంలో బాధితులు తమ దరఖాస్తులను కలెక్టర్ జి. వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి తదితర జిల్లా అధికారులకు అందచేశారు*

Related Posts