YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

శాసనసభకు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు!!

Highlights

బిల్లును సమర్థించిన జలగం

శాసనసభకు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు!!

తెలంగాణా యువతకి ప్రపంచ విద్యా అవకాశాలు కల్పించడం కోసం తెలంగాణా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును పూర్తిగా సమర్ధిస్తున్నట్లు కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకట రావు ప్రకటించారు.ఈ బిల్లు పై శాసనసభలో జరిగిన చర్చలో తెలంగాణా రాష్ట్ర సమితి తరపున జలగం వెంకట రావు ఒక్కరే మాట్లాడారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి సి‌ఎం కే‌సి‌ఆర్ గారు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు జలగం వివరించారు.విదేశాలకు వెళ్ళి చదువుకునేందుకు విద్యార్ధులకి ప్రభుత్వ పరం గా సాయం కూడా అందిస్తున్నట్లు జలగం తెలిపారు.ఈ బిల్లులో మన రాష్ట్రం వారికి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం సీట్లు కేటాయించాలని నిభందనలు పెట్టడం చాలా మంచి నిర్ణయం అని అన్నారు. అమెరికా సహ అనేక ప్రపంచ దేశాల్లోనూ,అదే విధంగా మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు అవుతున్నాయని జలగం అన్నారు.మారుతున్న పరిస్థితులకి విద్యార్దులు ఉన్నత విద్య చదవడానికి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తోడ్పడుతాయని అన్నారు. ప్రతి పక్షాలు కూడా ఈ బిల్లుని స్వాగతించాలని జలగం సూచించారు.పిల్లలు విదేశాలకు వెళ్ళి చదవొచ్చు కానీ ఇక్కడ మాత్రం ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రాకూడ దన్న భావన లో ప్రతిపక్షాలున్నాయని అన్నారు.ఈ బిల్లు వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఫార్మాసూటికల్స్ వంటి రంగాల్లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వస్తాయన్నారు.అవి రావడం వల్ల మరిన్ని పరిశోధనలు జరుగుతాయన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలని ఖచ్చితంగా బలోపేతం చేయాలన్నారు. అంతే కాకుండా అధ్యాపకుల బాగోగులు చూడాలి అని అన్నారు.

          అయితే విశ్వవిద్యాలయం ఏర్పాటుకి జిల్లాని  యూనిట్ గా తీసుకోవాలన్నారు. ఉదాహరణకి ఒక విశ్వవిద్యాలయం వెటర్నరీసైన్స్ క్యాంపస్ ఒకే చోట పెడితే ఫిషరీస్ క్యాంపస్ వేరే చోట పేట్టుకునే అవకాశం కల్పించాలన్నారు.అలాగే ఆన్ లైన్ కోర్సులకి అనుమతులు ఇవ్వాలన్నారు.అధ్యాపకులకి వయో పరిమితి ఉండకూడదని జలగం సూచించారు.ఫీజులు నియంత్రణ ఉండాలని జలగం అన్నారు.కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అవకాశం కల్పించాలని కోరారు.

          ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకి ఎండో మెంట్ నిధి పెద్ద మొత్తం లో ఉండాలని జలగం అన్నారు. కొత్తగూడెం లోని మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలని మరింత మెరుగు పరచాలని జలగం సూచించారు. దానిలో భవనాలు కూడా సరిగ్గా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద తెలంగాణలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ గారు గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారని,మౌలిక వసతులు కల్పిస్తున్నారని జలగం అన్నారు.ఇప్పుడు ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు విద్యాభివృద్ధికి మరింత దోహద పడుతుందని జలగం వివరించారు.

Related Posts