పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడలు
తిరుపతి ఫిబ్రవరి 10
టిటిడి ఉద్యోగుల క్రీడలు పోటాపోటీగా జరుగుతున్నాయి. సోమవారం జరిగిన పోటీల్లో గెలుపొందినవారి వివరాలిలా ఉన్నాయి.
చెస్ -
- టిటిడి సీనియర్ పురుష అధికారుల చెస్ సింగల్స్ పోటీల్లో శ్రీ మల్లీకార్జున ప్రసాద్ విజయం సాధించగా, టి.వి.సత్యనారాయణ రన్నరప్‌గా నిలిచారు.
బ్యాడ్మింటన్ -
- 50 ఏళ్లు పైబడిన పురుషుల బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో కె.ఎస్.బాల క్రిష్ణ జట్టు విజయం సాధించగా, వి.భాస్కర్ జట్టు రన్నరప్‌గా నిలిచారు.
క్యారమ్స్-
- 40 ఏళ్ల లోపు మహిళ ఉద్యోగుల క్యారమ్స్ సింగల్స్ పోటీల్లో ఎం.శ్రీలక్ష్మి విజయం సాధించగా, కె.సౌజన్య రన్నర్‌గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీలలో ఎం.శ్రీలక్ష్మి, జి.చిన్నమున్నెమ్మ విజయం సాధించగా, ఎన్.జానకి, జి.మనో చైత్ర రన్నరప్‌గా నిలిచారు.
టెన్నికాయిట్ -
- 41 నుంచి 50 ఏళ్ల లోపు మహిళ ఉద్యోగుల టెన్నికాయిట్ సింగిల్స్ పోటీలలో ఎన్.సుధారాణి, విజయం సాధించగా, టి.రాజేశ్వరి రన్నరప్‌గా నిలిచారు. టెన్నికాయిట్ డబుల్స్ పోటీలలో ఎన్.సుధారాణి, టి.రాజేశ్వరి జట్టు విజయం సాధించగా, జి.నాగమణి, పి.స్వప్న జట్టు రన్నరప్‌గా నిలిచారు.