ఫీజు రియంబర్స్మెంట్ నీధులు విడుదలకై విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు
ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 10
ఎమ్మిగనూరు పట్టణంలో
ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ విద్యార్థి సంఘాల నాయకుడు, జిల్లా అధ్యక్షుడు నరసన్న అధ్యక్షతన విద్యార్థులు పాల్గొని నిరాహార దీక్షలు చేపట్టారు. వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరముల నుండి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు స్కాలర్షిప్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వానికి నిరసనగా దీక్షలు చేపడుతామని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఇంకా పెద్ద ఎత్తున దీక్షలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.