దిక్కు లేకుండా తయారవుతున్న వర్శిటీలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 11,
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పాలకమండలి లేక దిక్కులేని దానిలా అవుతోంది. దాంతోపాటు ఉపకులపతి (వీసీ) లేక 200 రోజులు. ఓయూలో పూర్తి స్థాయి పాలకమండలి లేక ఐదేండ్లు దాటింది. 2011లో ఏర్పాటైన పాలకమండలి కాలపరిమితి 2014తో ముగిసింది. నాటి నుంచి మళ్లీ పాలకమండలి ఊసే లేదు. పాలకమండలిలో మొత్తం 13మంది సభ్యులు ఉంటారు. వారిలో కేటగిరి-1 కింద నలుగురు ఉంటారు. వారే వీసీ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్. కేటగిరి-2 కింద ఐదుగురు సభ్యులు ఉంటారు. వారిలో సీనియర్ ఆచా ర్యులు, ఓయూకు సంబంధించిన ప్రిన్సిపాల్, డిగ్రీ కళాశాల నుంచి సీనియర్ ప్రొఫెసర్, ఓయూ ప్రొఫెసర్, ఓయూ పరిధిలోని ఏదైనా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఉంటారు. కేటగిరి-3లో నలుగురు నిపుణులను నియమిస్తారు. ఇలా 13మంది సభ్యులతో పాలకమండలి ఉంటుంది. వీరుగాక ఓయూ రిజిస్ట్రార్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.దేశావ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీల్లో ఉస్మానియాకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి వర్సిటీపై సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మాజీ వీసీ రామచంద్రం ఉద్యోగ కాలం 2019, జులై 24న ముగిసింది. జులై 25న ఇన్‌చార్జి వీసీగా ఐఏఎస్ అర్వింద్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి నేటి వరకు ఓయూకు వీసీని నియమించలేదు. ఇన్‌చార్జి వీసీగా బాధ్యతులు చేపట్టిన అర్వింద్‌కుమార్ తన శాఖాపరమైన విధుల్లో బిజీగా ఉండటంతో యూనివర్సిటీపై దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో యూనివర్సిటీ అభివృద్ధి కుంటుపడుతున్నదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వివిధ అంశాలపై చర్చించడానికి సమయం అడిగినా ఇన్‌చార్జి వీసీ ఇవ్వట్లేదని కొందరు ఆచార్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు వినతిపత్రం ఇవ్వాలనుకున్నా సమయం కేటాయించట్లేదని చర్చ జరుగుతోంది.
మరోవైపు, అర్వింద్‌కుమార్ ప్రత్యేక చొరవతో 75లక్షల రూపాయలతో ఓయూ గార్డెనింగ్ ఆధునీకరణ పనులను చేయించారు. ఎన్నో మరమ్మత్తులు చేయించి యూనివర్సిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారని కొంతమంది వాదన. కోఠి ఉమెన్స్ కళాశాలలోని హెరిటేజ్ దర్భార్‌హాల్‌కు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నిధుల మంజూరులో అర్వింద్ కృషి చేశారు. కానీ, పూర్తిస్థాయి వైస్‌చాన్స్‌లర్ లేకపోవడంతో పరిపాలన, అభివృద్ధి కుంటుపడుతుందని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఉపకులపతి, పాలకమండలి లేకపోవడంతో శాఖాపరమైన అంశాలు పెండింగ్ పడ్డాయి. రెండేండ్లుగా అధ్యాపకుల ఉద్యోగోన్నతులకు నిర్వహించే సీఏఎస్ ఇంటర్వ్యూలు ఆగిపోయాయి.ఓ కేసులో ఇదే విషయాన్ని ఉన్నత న్యాయస్థానం కూడా ప్రస్తావించడం గమనార్హం. సున్నితమైన కారణాలు చూపుతూ అనేక అభివద్ధి కార్యక్రమాలు,