ఏటీఎంల దగ్దానికి విఫలయత్నం
హైదరాబాద్ ఫిబ్రవరి 11,
పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోన్ని బంగారు మైసమ్మ దేవాలయం పక్కన ఉన్న ఐసీఐసీఐ, ఆక్సిస్స్ బ్యాంక్ల ఏటీఎంల పై గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు ఆంటిచడానికి ప్రయత్నం చేసారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పివేసారు. నిందితులకోసం గాలిస్తున్నారు. మధ్యరాత్రి సుమారుగా 3 గంటల 20 నిమిషాల లకు ఎటిఎం ల పై ఇంజన్ ఆయిల్ పోసి నిప్పు అంటించటం తో మంటలు రావటంతో వారు పారిపోయారు. స్థానికులు పోలుసులకు సమాచారం ఇచ్చారు. రెండు బ్యాంక్ ల మేనేజర్ లకు సమాచారం ఇవ్వటంతో వారు ఘటన స్థలానికి వచ్చారు.