శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే
తిరుమల ఫిబ్రవరి 11
శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సే, అయన
కుమారుడు యోషిత రాజపక్సే, ఆ దేశ మంత్రి ఆర్ముగన్ తొండమాన్ తో కలిసి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధాని బృందానికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి మహద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పడికావలి నుండి ధ్వజ మండపం వరకు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేసిన కదిలే పైకప్పు గురించి గౌ. ప్రధానికి ఈఓ వివరించారు. అనంతరం శ్రీలంక ప్రధాని బృందం అష్టదళ పాదపద్మారాధన సేవలో, విఐపి బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత టిటిడి ఈవో, అదనపు ఈవో కలిసి తీర్థప్రసాదాలు అందించారు.