టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా వైట్ వాష్ !!
ఓవల్ వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ విజయబావుటా ఎగురవేసింది. ఇప్పటికే 2 వన్డే మ్యాచులు ఓడిపోయి సిరీస్ చేజార్చుకున్న టీమిండియా మూడో మ్యాచులో ఓటమి పాలైంది. దీంతో 5 వికెట్ల తేడాతో టీమిండియాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. టీమిండియా విధించిన 297 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు సునాయసంగా అందుకుంది. కివీస్ ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (66), హెన్రీ నికోలస్ (80) రాణించడంతో తొలి వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కేన్ విలియమ్సన్(22), రాస్ టేలర్(12) తక్కువ పరుగులకే ఔటైనప్పటికీ, చివర్లో బ్యాటింగ్‌కు దిగిన గ్రాండ్ హామ్(58) 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడంతో 47.1 ఓవర్లలోనే టీమిండియా లక్ష్యాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. మొదట కివీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు రెండో ఓవర్ చివరి బంతికే ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా 8 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 9 పరుగులకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా మాత్రం మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 40 పరుగులు చేసి రాణించాడు. డీ గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో పృథ్వీ షా రనౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్(62) హాఫ్ సెంచరీతో, లోకేష్ రాహుల్(112) సెంచరీలతో రాణించారు. మనీష్ పాండే తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 48 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో బెన్నెట్ 4 వికెట్లు తీయగా.. జెమిసన్, నీషమ్‌కు చెరో వికెట్ దక్కింది.