డాక్టర్ వసంత్ పై క్రమశిక్షణ చర్యలు
సికింద్రాబాద్ ఫిబ్రవరి 11
గాంధీ ఆస్పత్రి లో వైద్యుడు వసంత్ చేసిన హల్ చల్ పై డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం అయన మీడియతో మాట్లాడారు. డాక్టర్ వసంత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్. రెండు రోజుల క్రితం ఆసుపత్రి సుపరిటెండెంట్ రూమ్ లో నరుగుతున్న మీటింగ్ లో కూడా హల్ చల్ చేశారు. అక్కడే ఆర్ఎమ్వో వన్ ను దుర్భాశలు ఆడారు. దీనితో ఆయన మీద సుపెరిండెంట్ యాక్షన్ తీసుకుని పబ్లిక్ హెల్త్ కి సరెండ్ చేశారు. క్రమశిక్షణ లేని వారి మీద చర్యలు తప్పవని అన్నారు. గతంలో కూడా వసంత్ మీద పలు ఆరోపణలు వచ్చాయి. మేము గతంలో ఆయనకు వార్నింగ్ ఇచ్చాం. ఒక డాక్టర్ ఇలాంటి చర్యలు చేస్తే రోగులకు ఎంత ఇబ్బంది కలుగుతుంది. గతంలో కూడా రెండు ఘటనలో ఆయన ఆస్పత్రి వారిని కిరోసిన్ పోసుకుంటా అని బెదిరించారని అయన అన్నారు. ఇవాళ వసంత్ చేసిన ఆరోపణలు ముందే తెలిస్తే... మాకు ఎందుకు చెప్పలేదు. డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ ఆయన మీద చర్య తీసుకుంటారు. ఆయన ఆర్ ఎం ఓ వన్ ని దుర్భాశలు ఆడటం వల్లే చర్యలు తీసుకున్నాం. ఆయన మీద ఆరోపణలు వచ్చిన తరువాత మా మీద ఆరోపణలు చేయడం సరి కాదని అయన అన్నారు.