YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ దేశీయం

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది: కోదండరాం

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది: కోదండరాం

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది: కోదండరాం
హైదరాబాద్ ఫిబ్రవరి 11 
దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, పన్నుల వసూళ్లతో పాటు రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయం తగ్గుతోందని చెప్పారు. బిల్లులపై కేంద్రానికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది కానీ... రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్రాలకు నిధులు తగ్గించి జమ్మూకశ్మీర్‌కి కేటాయించడం సరికాదన్నారు. జమ్మూకశ్మీర్‌కు గ్రాంట్‌ల రూపంలో నిధులు ఇవ్వాలని తెలిపారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎన్ని, నిధులు ఎందుకు రాబట్టలేకపోతున్నారో  చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎల్‌ఐసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం సరైంది కాదని కోదండరాం అన్నారు. 

Related Posts