YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

షీ టీమ్స్ నెంబర్లు గుర్తుంచుకొండి

షీ టీమ్స్ నెంబర్లు గుర్తుంచుకొండి

షీ టీమ్స్ నెంబర్లు గుర్తుంచుకొండి
సికింద్రాబాద్ ఫిబ్రవరి 11
సికింద్రాబాద్ స్వామి వివేకానంద ఇంజినీరింగ్ కాలేఈ  ఆడిటోరియంలో  "షీ టీమ్స్" ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్ సేఫ్టీ క్లబ్స్ అనే ఈ లెర్నింగ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  భారత బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమ్మింగ్, ఐజీ స్వాతి లక్రా, డి ఐ జి సుమతి పాల్గొన్నారు. ఐజీ స్వాతిలక్రా మాట్లాడుతూ  మహిళలు ఒంటరిగా బయటికి వెళ్ళినప్పుడు పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ లను, హాక్ ఐ యాప్ ను వినియోగించాలని, తెలంగాణ లోని ఏ మారుమూల ప్రాంతంలో ఏమైనా మహిళల పట్ల దాడులు జరిగిన షీ టీం వాట్సాప్ నెంబర్ లో సమాచారం అందిస్తే దగ్గర్లోని షీ టీం మీకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు..  తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఆపదలు వచ్చిన, ఎలాంటి దాడులు జరిగిన, ముఖ్యంగా స్త్రీల మీద దాడులు జరిగిన పోలీస్ యంత్రాంగం ప్రజల వెంట ఉంటుందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో  వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts