YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మహిళలు వీరోచితంగా పోరాడారు: టీడీపీ అధినేత చంద్రబాబు

మహిళలు వీరోచితంగా పోరాడారు: టీడీపీ అధినేత చంద్రబాబు

మహిళలు వీరోచితంగా పోరాడారు: టీడీపీ అధినేత చంద్రబాబు
         టీడీపీ నేత పట్టాభిపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం
అమరావతి ఫిబ్రవరి 11
రాజధాని ఉద్యమంలో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించినా మహిళలు వీరోచితంగా పోరాడారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ అనంతరం మీడియాతో మాట్లాడిన బాబు.. వైసీపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను రద్దు చేశారన్నారు. ‘పోలవరం, అమరావతిని ఆపేశారు. నాలుగైదు రెట్లు ఇసుక ధర పెంచేశారు.భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. 56 రోజులుగా అమరావతిపై ఆందోళనలు జరుగుతున్నాయి. 40 మంది రాజధాని రైతులు గుండె ఆగి చనిపోయారు. 80 శాతం మంది మూడు రాజధానులు వద్దని చెప్పారు. ఇంట్లో నుంచి బయటకు రాని మహిళలు ఇవాళ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.కాగాటీడీపీ నేత పట్టాభిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా పట్టాభి ప్రస్తావన రాగా.. బాబు ఆగ్రహంతో ఊగిపోయారు.!. ఇటీవల ఎంపీ కేశినేని నాని-పట్టాభి మధ్య ఒకింత మాటల యుద్ధం జరిగింది.! దీంతో కేశినేని వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని పట్టాభి వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పట్టాభి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలే తప్ప ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని చంద్రబాబు మండిపడ్డారు.ఇవాళ అమరావతిలో తెలుగు దేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అనంతరం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు.. తాజా పరిణామాలపై నిశితంగా చర్చించారు

Related Posts