YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

తప్పు చేస్తే బాధ్యత వహించాల్సిందే

తప్పు చేస్తే బాధ్యత వహించాల్సిందే

తప్పు చేస్తే బాధ్యత వహించాల్సిందే
విశాఖపట్నం  ఫిబ్రవరి 11 
అవినీతి ఆరోపణలకు సంబంధించి అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మరో అధికారిపైనా ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. దీన్ని కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న చంద్రబాబు, ఐటీశాఖ దర్యాప్తులపై మాత్రం నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. ఐటీ శాఖ దర్యాప్తులపై ఎల్లో మీడియా కూడా స్పందించడం లేదన్నారు. తప్పు చేసింది ఎవరైనా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి అవసరం లేదా అని ప్రశ్నించారు.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని బొత్స చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ చంద్రబాబు దొంగలా హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చారని విమర్శించారు. లక్షా 9వేల కోట్లతో ఒక ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఏం చేసినా రియాల్టీగా ఉంటుందన్నారు. ఐదేళ్లలో హైదరాబాద్‌కు ధీటుగా విశాఖను తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు మంత్రి చెప్పారు.

Related Posts