YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వికేంద్రీకరణకు మైనారిటీల మద్దతు

వికేంద్రీకరణకు మైనారిటీల మద్దతు

వికేంద్రీకరణకు మైనారిటీల మద్దతు
తాడేపల్లి ఫిబ్రవరి 11
మన ప్రభుత్వం,  వైయస్ జగన్ గారు తీసుకున్న అభివృధ్ది  వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ విషయంలో రాష్ట్రం సమగ్రంగా అభివృధ్ది చెందుతునే అంశాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లాలని రాష్ట్ర డిప్యూటి సిఎం అంజాద్ భాషా అన్నారు.  మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. అనేక దశాభ్దాలుగా వెనకబడి ఉత్తరాంధ్ర అయినా, రాయలసీమ అయినా వాటితో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృధ్ది చేయాలి.దానిలో భాగంగా మైనారిటి సెల్ రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించాం.అందరి అభిప్రాయాలు తీసుకున్నాం.  వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తంఅయిందని అయన అన్నారు.  ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇతర జిల్లాలనుంచి వచ్చిన మైనారిటి నేతలందరూ ముఖ్యమంత్రి  నిర్ణయంపట్ల స్వాగతిస్తున్నారు.  భారతదేశవ్యాప్తంగా కాని ఆంధ్రప్రదేశ్ లో బిసి ఎస్సి ఎస్టి మైనారీటీలలో అభధ్రతాభావం  ఏర్పడింది. ముఖ్యంగా మైనారిటీలలో సిఏఏ, ఎన్ పి ఆర్, ఎన్ ఆర్ సి లపై తీవ్ర ఆందోళన నెలకొంది.ప్రజాప్రతి«నిధులందరూ కూడా దీనిపై మాట్లాడారు.ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వారితో చర్చించారు. ఏపిలో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగాఈరోజు ఆందోళనలు,ధర్నాలు చేస్తున్న మైనారిటీ సోదరులకు ఇదే వేదికపై నుంచి ఒకటే స్పష్టంగా చెబుతున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మైనారిటీల పక్షపాతిగా గతంలో కూడా ఉంది ఎప్పటికీ ఉంటుంది. సిఏఏ కి సంబంధించి భారతదేశానికి ఒక భధ్రతభావనగా ఆ చట్టాన్ని తీసుకువచ్చారు.విదేశాలనుంచి మనదేశానికిముప్పు ఉందని భావించిన తరుణంలో పాకిస్తాన్ ,బంగ్లాదేశ్ ,ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలలో ఉండే మైనారిటీలు అక్కడ ఇమడలేకపోతున్నారో వారికి మన పౌరసత్వం కల్పించే ప్రొవిజన్ రాజ్యాంగంలో ఉంది.దానికి అనుగుణంగా వారికి పౌరసత్వం ఇస్తామని చెప్పితీరును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు వారు ఆనాడు చెప్పిన తీరు ఓ విధంగా ఉంది.అదే చట్టాన్ని భారతదేశవ్యాప్తంగా అమలు చేస్తున్న తీరు మరోరకంగా ఉంది.కాబట్టి దేశవ్యాప్తంగా మైనారిటీలు ఆందోళనలో ఉన్నారు కాబట్టి మా పార్లమెంట్సభ్యులు శ్రీ మిధున్రెడ్డి్డ గారు పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పారు.బడ్జెట్ సెషన్,ఆల్ పార్టీ మీటింగ్ లో చెప్పారని అన్నారు. ఆ చట్టాన్ని తీసుకువచ్చేటప్పుడు చెప్పిన వి«ధానానికి అమలు చేస్తున్న విధానానికి తేడా ఉంది కాబట్టి వ్యతిరేకిస్తున్నాంమని  చెప్పారు. దాంట్లో భాగంగా ఈరోజు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఎవరికి అన్యాయం చేసే ఏ చట్టాన్ని కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్దాయిలో వ్యతిరేకిస్తుందని స్పష్టంగా చెబుతున్నాను. ఎన్ ఆర్ సి పై ప్రజలలో చాలా ఆందోళనగా ఉంది.ఈ అంశాన్ని గౌరవముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లాం.ఆరోజు గౌరవ ముఖ్యమంత్రిగారు కూడా స్వయంగా ఆయన నోటీద్వారా కడప బహిరంగసభలో ఎన్ ఆర్ సి ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు.రాబోయే రోజులలో ఆ బిల్లు ఏ రూపంలో వచ్చినా వ్యతిరేకిస్తామని చెప్పారు.ఎన్ పి ఆర్ పై గా ఆందోళన ఉంది.  దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ర్యాలీలు,ప్రదర్శనలు,ధర్నాలు జరుగుతున్నాయి.వారికి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది.2010,2015లో ఎన్ పి ఆర్ చేయడం జరిగింది.కాని ఆ రెండుసార్లు చేసిన ఎన్ పి ఆర్ కు భిన్నంగా ఆ డాక్యుమెంట్లలో 2020లో కొన్ని కాలమ్స్ ఎక్స్ ట్రాగా యాడ్ చేశారు.13 ఏ,13 బి లాంటి ఇతర కాలమ్స్ ఏర్పాటుచేశారు.ఆఫార్మెట్ ను మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అయన అన్నారు. 

Related Posts