YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మోడీ పాలసీనే ఫాలోఅవుతున్న జగన్

మోడీ పాలసీనే ఫాలోఅవుతున్న జగన్

మోడీ పాలసీనే ఫాలోఅవుతున్న జగన్
గుంటూరు, ఫిబ్రవరి 12,
జగన్ వరసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఖజనాకు ఎంతో కొంత పొదుపు చేయాలన్న ఉద్దేశ్యంతో పాటు, శాంతిభద్రతలను మరింత పటిష్టంగా అమలు చేయాలన్న ఆలోచనలతో దూకుడుగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్లను కట్ చేయాలని జగన్ కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. దాంతో మాజీ మంత్రులు ఎక్కువగా ఉన్న టీడీపీకి ఈ స్ట్రోక్ డైరెక్ట్ గానే తగలనుంది. ఇందులో మొదటి వేటు జేసీ దివాకరరెడ్డి మీదనే పడిందని అంటున్నారు.టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆయనకు పూర్తిగా భద్రతను తొలగించింది. గతంలో దివాకర్ రెడ్డికి 2 ప్లస్ 2 భద్రత ఉండేది. దీన్ని 1 ప్లస్ 1కు తగ్గించిన వైసీపీ ప్రభుత్వం తాజాగా భద్రతను పూర్తిగా ఉపసంహరించుకుంది. రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జేసీకి భద్రతను తొలగించడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. జేసీ కుటుంబంపై జగన్ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికితోడు ఆయనకు చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి భూములను రద్దు చేశారు.ఇదిలా ఉండగా ఇప్పటికే చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్ కి భద్రతను బాగా తగ్గించేశారు. దాంతో టీడీపీ భావి నాయకుడు ఆగ్రహంగా ఉన్నారు. తనకు ఇంత తక్కువ భద్రతా తన స్థాయిని తగ్గించారంటూ కస్సుబుస్సులాడుతున్నారు. ఇపుడు అదే వరసలో మిగిలిన మాజీ మంత్రులకు, కాంగ్రెస్ లో గతంలో మంత్రులుగా పనిచేసిన వారికి, బీజేపీ ద్వారా మంత్రులైన వారికి కూడా గన్ మెన్లను కట్ చేయబోతున్నారుట.ఇప్పటికే అన్ని పార్టీలు ఒక్కటిగా జగన్ మీద దండెత్తుతున్నాయి. జనసేన, వామపక్షాలకు ఎమ్మెల్యేలు, మంత్రుల గొడవ లేదు కాబట్టి వారికి ఈ షాక్ ట్రీట్ మెంట్ పనిచేయదు. మిగిలిన పార్టీలన్నీ ఏదో సమయంలో అధికారాన్ని అనుభవించినవే. ఇదిలా ఉండగా మాజీ మంత్రులకు, పెద్దలకు గన్ మెన్లను పెట్టడం వల్ల అవసరమైనంత సిబ్బంది శాంతి భద్రతలకు లేరన్న మాట చాలా కాలంగా ఉంది. జాతీయ స్థాయిలో కూడా మోడీ సర్కార్ కూడా ప్రముఖుల భద్రత కుదింపు విషయంలో చర్యలు తీసుకుంటోంది. జగన్ కూడా దాన్ని అనుసరిస్తూ సాహసంగా ముందుకు సాగుతున్నారని అంటున్నారు. మరి ఇది ఏపీలో మరో రాజకీయ రచ్చకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంది.

Related Posts