YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తప్పుల తడకలుగా ఓటర్ల జాబితా

తప్పుల తడకలుగా ఓటర్ల జాబితా

తప్పుల తడకలుగా ఓటర్ల జాబితా
నెల్లూరు, ఫిబ్రవరి 12,
మున్సిపల్‌ ఎన్నికల కోసం తయారుచేసిన ఓట్ల జాబితా తప్పుల వి
షయంలో అధికారులు అదేపాట పాడుతున్నారు. కనీస అవగాహన లేకుండా. అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. రాజకీయపార్టీలు, అధికారులతో ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. రాజకీయపార్టీలు అధికారులు చేసిన తప్పులను ఎత్తిచూపినా పట్టీపట్టనట్లు వ్యవహరించారని వివిధ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా తయారు చేయడంలోనూ, డివిజన్ల విభజన ప్రక్రియలోనూ అడ్డదిడ్డంగా వ్యవహరించారు. ఆయా డివిజన్ల జనాభా, ఓటర్లకు అసలు సంబంధమే లేకుండా చేశారు. ఇదే విషయాన్ని రాజకీయపార్టీల నాయకులు అధికారులు దృష్టికి పోగా, నిర్లక్ష్యమైన సమాధానమే వచ్చింది. మేం తప్పులు చేస్తాం. సరిచేసు కోవాల్సిన బాధ్యత మీదే అన్నట్లు అధికారులు వ్యవహరించారు. ఇప్పటికీ నెల్లూరు కార్పొరేషన్‌ ఓటర్ల జాబితా, వివిధ అంశాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అధికారులు మాత్రం తీరుమారడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే అస్తవ్యస్తంగా మారుతుంది.రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికలకు సమాయత్తమవుతోంది.ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, బ్యాలెట్‌ బాక్సులు సమకూర్చుకున్నామని, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తాము నిర్వహిస్తామని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియకు ముందు ఓటర్ల జాబితా సిద్ధం కావాల్సి ఉంది.అధికారులు ఓటర్ల జాబితా తయారుచేయడంతో పక్షపాతధోరణితో వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఓట్ల జాబితా పరిశీలించిన తరువాత తప్పుల తడకగా ఉన్న దానిని చూసి రాజకీయపార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌లోని 54 డివిజన్లకు పునర్విభజన చేశారు. అందుకు సంబంధించిన మ్యాప్‌ను ఎక్కడా చూపించలేదు. ఇష్టానుసారంగా హద్దులు మార్చినట్లు తెలుస్తోంది. ఏ డివిజన్‌ ఎక్కడ ప్రారంభమై, ఎక్కడ ముగుస్తోందో అందులో చూపించినా అది సక్రమంగా లేదనే విమర్శలున్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నికల నిర్వాహణ ప్రక్రియ నిబంధనలకు పూర్తిగా భిన్నగా జరుగుతుందని తెలుస్తోంది. రాజకీయపార్టీలకు ఇచ్చిన ఓటర్ల జాబితాను పరిశీలించిన తరువాత అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డివిజన్‌ జనాభాకు ఓటర్ల జాబితాకు భారీ వ్యత్యాసం ఉంది. రెండు నుంచి 6 వేల వరకు ఓట్లు డివిజన్‌లో కనిపించడం లేదు. ఎవరి ఓటు ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఒక్కొక్కరికి ఐదు ఓట్లు ఉన్న పరిస్థితులున్నాయి. అధికారులు తప్పులు కళ్ల ముందు కనిపిస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. శుక్రవారం కమిషనర్‌ మూర్తి కార్పొరేషన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. దీనికి సిపిఎం, సిపిఐ, వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌, జనసేన పార్టీ నేతల హాజరై జాబితాలోనూ, డివిజన్ల విభజనలో జరిగిన పొరపాట్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు చేసిన తప్పులను సరిచేయాల్సిన అధికారులు అది తమపనికాదనట్లు వ్యవహరించినట్లు తెలిసింది. పది ఓట్లు ఉన్న వ్యక్తి తనకు ఓట్లు ఉన్నాయని తొలగించాలని అభ్యంతరాలు తెలుపుతూ ఫాం 6,7 పెట్టుకుంటే అప్పుడు పరిశీలిస్తామని చెప్పడం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుంది. డివిజన్ల విభజనలో జరిగిన పొరపాటుచెప్పినా ఇదే తరహా సమాధానాలు రావడంపై రాజకీయపార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎందుకు సమావేశం ఏర్పాటుచేశారో అర్ధంకాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇవే కాకుండా 2012లో పొట్టేపాళెం గ్రామ పంచాయతీని కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో కార్పొరేషన్‌ నుంచి పొట్టేపాళెం గ్రామపంచాయతీని తొలగించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెట్టి డివిజన్‌ హద్దులు తయారుచేశారు.జనవరి 28న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీని తరువాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది.అధికారులు డిసెంబర్‌లోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. డివిజన్‌లో ఓటర్ల సంఖ్య పదిశాతం కంటే వ్యత్యాసం ఉండకూడదని ఎన్నికల నిబంధనలో ఉంది. కార్పొరేషన్‌ అధికారులు దీనిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఓటర్ల సంఖ్యను డివిజన్లు, డివిజన్లకు మార్పుచేశారు. అధికారపార్టీ నేతలు చెప్పినట్లుగా మున్సిపల్‌ అధికారులు వ్యవహరించారని తెలుస్తోంది. తమ డివిజన్లు హద్దులు మారకుండా అధికారపార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతిపక్షాలకు బలమైన చోట కాస్త, ఆటు ఇటుగా డివిజన్లు మార్పుచేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జరిగిన తప్పులను ఆధారాలతో సహా రాజకీయపార్టీలు తమ బాధ్యతగా చూపుతుంటే సరిచేయాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నాన్చుడి ధోరణితో ముందుకుపోతున్నారు. ఓట్ల జాబితా పూర్తి స్థాయిలో సిద్ధమైన తరువాతే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది.ఇందుకు భిన్నంగా నెల్లూరు కార్పొరేషన్‌లో వ్యవహరిస్తున్నారు. ఏకంగా ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించేలా అధికారులు చర్యలు కనిపిస్తున్నాయి. తప్పులను సరిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ ఓటర్లదే బాధ్యత అన్నట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా ప్రజలు తమ డివిజన్‌కు ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్లను ఎన్నుకోవాల్సి ఉంది. డివిజన్‌ ఓటర్ల ఓట్లు అక్కడ కాకుండా మరో డివిజన్‌కు బదలాయించడం అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏం జరుగుతుందో చూడాలి. మున్సిపల్‌ అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువస్తున్నాయి. ఇందులోనే ఇలా ఉంటే రేపు రిజర్వేషన్లలో అధికారులు ఎన్ని లీలలు చేస్తారోననే భయం వెంటాడుతోంది.

Related Posts