నిర్మాతను చెప్పుతో కొడుతానన్న హీరోయిన్
హాలీవుడ్ దర్శకుడు హార్వే విన్‌స్టెయిన్ లైంగిక వేధింపుల విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరుగా హీరోయిన్లు పెదవి విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో హీరోయిన్లకు లైంగిక వేధింపుల అంశాన్ని ఒక్కొక్కరుగా బయటపెడుతున్నారు. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్ శృతి హారిహరన్ భయంకరమైన వాస్తవాన్ని వెల్లడించింది.
అయితే ఆ సమయంలో నిర్మాత ఏమన్నారంటే.. ఈ సినిమాకు మేము ఐదుగురం నిర్మాతలం. ఈ సినిమాలో నీకు అవకాశం ఇచ్చినందుకు మేము నిన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకొంటాం. అలా అయితేనే మేము నీకు ఆఫర్ ఇస్తాం అని ఆ నిర్మాత చెప్పారు.అందుకు నేను సమాధానం ఇస్తూ.. నేను స్లిప్పర్ కూడా పట్టుకొస్తాను. ఆ తర్వాత ఏం జరిగినా పట్టించుకోవద్దు అని అన్నాను. దాంతో వారు ఆ సినిమా నుంచి తప్పించారు అని శృతి హరిహరన్ చెప్పారు.ఆ సంఘటన తర్వాత నిర్మాతల ఒత్తిడితో చాలా సినిమాలు నా వద్దకు వచ్చినట్టే వచ్చి చేజారాయి. ఆమెతో సినిమా చేయడం చాలా ప్రమాదకరం అని నాపై నిర్మాతలు తప్పుడు ప్రచారం చేశారని శృతి హరిహరన్ వెల్లడించారు.
నా సినిమా కెరీర్‌లో అలాంటి సంఘటన మొదటిది కాదు. నా 18వ ఏటనే ఇలాంటి దారుణమైన ఘటనను చవిచూశాను. కన్నడ సినిమా షూటింగ్ సెట్లో నాతో దారుణంగా ప్రవర్తించారు. నేను అడ్డు చెప్పడంతో పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో ఆమెకు తెలియదు. ఇక వదిలేద్దాం అని నిర్మాతలు తప్పించుకొన్నారు అని శృతి హరిహారన్ పేర్కొన్నారు