YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం దేశీయం

 కొనసాగుతున్న బంగారం పతనం

 కొనసాగుతున్న బంగారం పతనం

 కొనసాగుతున్న బంగారం పతనం
ముంబై, ఫిబ్రవరి 12,
పసిడి వెలవెలబోయింది. బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఇప్పుడు పసిడి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి కూడా పతనమైంది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. అలాగే దేశీ మార్కెట్‌లోనూ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పడిపోయింది. దీంతో పసిడి ధర దిగొచ్చింది. అంతేకాకుండా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలపడటం కూడా పసిడి ధరపై ప్రతికూల ప్రభావం చూపింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర క్షీణించింది. పసిడి ధర ఔన్స్‌కు 0.24 శాతం తగ్గింది. 1,575.75 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.55 శాతం తగ్గుదలతో 17.69 డాలర్లకు క్షీణించింది.హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర పడిపోయింది. పసిడి ధర 10 గ్రాములకు రూ.290 క్షీణించింది. దీంతో ధర రూ.38,980 నుంచి రూ.38,690కు తగ్గింది.అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగానే దిగొచ్చింది. రూ.290కు పడిపోయింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,530 నుంచి రూ.42,240కు తగ్గింది.బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.300 దిగొచ్చింది. దీంతో ధర రూ.49,300 నుంచి రూ.49,000కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయరీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.290 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.38,690కు క్షీణించింది. వెండి ధర రూ.49,000కు దిగొచ్చింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.300 క్షీణించింది. దీంతో ధర రూ.40,700కు దిగొచ్చింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 క్షీణతతో రూ.39,500కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర రూ.300 తగ్గుదలతో రూ.49,000కు క్షీణించింది.

Related Posts