ఫ్రాంక్ వీడియోత్ కలకలం
మాస్కో ఫిబ్రవరి 12,
ముఖానికి మాస్క్ పెట్టుకుని మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఒక్కసారే కుప్పకూలాడు. తనకు కరోనా వైరస్ ఉందని గట్టిగా అరిచాడు. దీంతో ప్రయాణికులు అతడి నుంచి దూరంగా పరుగులు పెట్టారు. తమకు వైరస్ సోకి ఉంటుందేమోనని భయాందోళనలకు గురయ్యారు. అసలు విషయం తెలిసిన తర్వాత అతడిని కొట్టినంత పనిచేశారు.ఈ ఘటన రష్యాలోని మస్కో అండర్‌గ్రౌండ్ మెట్రో రైలులో చోటుచేసుకుంది. కరోమాత్ ఝబరావ్ అనే ఓ బ్లాగర్, అతడి స్నేహితులు రైల్లో ఒక ప్రాంక్ వీడియో తీయాలని అనుకున్నారు. ఈ సందర్భంగా కరోమాత్ కరోనా వైరస్ సోకినట్లుగా రైల్లో కిందపడిపోయి భయపెడతానని తెలిపాడు. చెప్పినట్లే మాస్క్ ధరించి రైలు ఎక్కిన కరోమాత్ కరోనా వైరస్ అని అరుస్తూ కిందపడ్డాడు. దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలను దక్కించుకునేందుకు అతడి నుంచి దూరంగా పరిగెట్టారు. కొద్దిసేపటి తర్వాత కరోమాత్ తనకు వైరస్ లేదని, భయపడొద్దని ప్రయాణికులకు తెలిపాడు. ఇటీవల ఈ వీడియోను కరోమత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.ఈ వీడియో చూసిన పోలీసులు కరోమత్, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. సబ్‌వే మెట్రో రైలులో భయాందోళనలు కలిగించినందుకు కోర్టు అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. కరోమత్ లాయర్ స్పందిస్తూ.. ఆ ప్రాంక్ వీడియో ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుందని అతడు భావించలేదని తెలిపారు. అతడు ఒక మంచి ఉద్దేశంతోనే ఈ పని చేశాడని, కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో బయటకు వచ్చినప్పుడు ఫేస్ మాస్కులు ధరించకపోతే ఎంత ప్రమాదమో చెప్పేందుకు ఈ ప్రాంక్ చేశాడన్నారు.