తన ఇల్లును వేద పాఠశాలకు విరాళంగా ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం
నెల్లూరు ఫిబ్రవరి 12
విశ్వవిఖ్యాత గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం తన ఉదారత్వాన్ని చాటుకుని పదుగురికి ఆదర్శంగా నిలిచారు. తరతరాలుగా తనకు సంప్రాప్తించిన ఆస్తిని ఆ మధుర గాయకుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం వేద పాఠశాలకు విరాళంగా ఇచ్చేశారు. నెల్లూరు లోని తిప్పరాజువారి వీధిలో ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంకు తాతలతండ్రుల నుంచి వచ్చిన ఇల్లు ఉన్నది. ఆ ఇంటిలో వేద పాఠశాల ఏర్పాటు చేయాలనే తలంపుతో ఆయన ఆ ఇంటిని కంచి కామకోటి పీఠానికి విరాళంగా ఇచ్చారు. ఈ ఇంటిలో కంచి పీఠం వారి వేద పాఠశాల త్వరలో ఏర్పాటు కాబోతున్నది. ఆయన మధుర గాయకుడే కాదు. మనుసున్న మా రాజు అని నిరూపించుకున్నారు.