YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

ట్రంప్‌ రాక అత్యంత ఆనందాన్ని క‌లిగిస్తుంది: ప్ర‌ధాని మోదీ

ట్రంప్‌ రాక అత్యంత ఆనందాన్ని క‌లిగిస్తుంది: ప్ర‌ధాని మోదీ

ట్రంప్‌ రాక అత్యంత ఆనందాన్ని క‌లిగిస్తుంది: ప్ర‌ధాని మోదీ
  తనకు కోటి మంది వరకూ వెల్ కం చెప్పాలి.. డొనాల్డ్ ట్రంప్..
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 12
అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ భార‌త్ రానున్న విష‌యం తెలిసిందే. ఈనెల 24, 25 తేదీల్లో ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు. ట్రంప్‌ రాక అత్యంత ఆనందాన్ని క‌లిగిస్తుంద‌ని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు.  ఆత్మీయ అతిథికి మ‌రిచిపోలేని స్వాగ‌తం ఏర్పాటు చేస్తామ‌ని మోదీ అన్నారు.  ట్రంప్ రాక ప్ర‌త్యేక‌మైంద‌ని,  భార‌త్‌, అమెరికా స్నేహ‌బంధాన్ని బ‌లోపేతం చేసేందుకు అది దోహ‌ద‌ప‌డుతుంద‌ని మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యం, బ‌హుళ‌త్వం అంశంలో రెండు దేశాలు ఒకేవిధంగా క‌ట్టుబ‌డి ఉన్నాయ‌న్నారు. అనేక అంశాల్లో రెండు దేశాలు విస్తృత స్థాయిలో స‌హ‌కారం అంద‌జేసుకుంటున్నాయ‌న్నారు.  మ‌న స్నేహ‌బంధం వ‌ల్ల ప్ర‌పంచ దేశాల‌కు కూడా మంచి జ‌రుగుతుంద‌ని మోదీ ఆశాభావం వ్య‌క్తం చేశారు.  కాగాభారత జనాభా ఎంత..? 130 కోట్లకు పైగానే.. మరి ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడు ఇండియాకు వస్తే ఎంత మంది స్వాగతించాలి.? అందులో కనీసం 1శాతం తీసుకున్నా కోటి మంది వరకూ ఆయనకు వెల్ కం చెప్పాలి.. కానీ మోడీ మాత్రం తనకు కేవలం లక్షల సంఖ్యలో ప్రజలు మాత్రమే స్వాగతం పలుకుతారని చెప్పాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.భారత్ పర్యటన పై ట్రంప్ కూడా స్పందించారు. ప్రధాని మోడీ నాకు మంచి స్నేహితుడు అని.. ఆయన చాలా జెంటిల్ మెన్ అంటూ చెప్పుకొచ్చాడు. మోడీతో భారత పర్యటన గురించి చర్చించానని.. భారత్ కు వస్తే ట్రంప్ కు లక్షల మంది స్వాగతం పలుకుతారని తనతో చెప్పాడని ఉప్పొంగిపోయారు. అయితే ఇటీవల అమెరికాలో తన ర్యాలీకి 50వేల మంది వచ్చారని.. మోడీ చెప్పిన లక్షల సంఖ్య తనకు సంతృప్తినివ్వడం లేదని ట్రంప్ చలోక్తులు విసిరారు. భారత జనాభాను బట్టి కనీసం 50-70లక్షల మంది ప్రజలు తనను స్వాగతించడానికి రావాలని సరదాగా వ్యాఖ్యానించారు.ఇక భారత్ తో వాణిజ్య ఒప్పందం గురించి చర్చిస్తున్నామని.. సరైన ఒప్పందం కుదిరితే చేసుకుంటామని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Related Posts