YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అస్సాంలో  జాతీయ పౌర ప‌ట్టిక సుర‌క్షితం: కేంద్ర హోంశాఖ

అస్సాంలో  జాతీయ పౌర ప‌ట్టిక సుర‌క్షితం: కేంద్ర హోంశాఖ

అస్సాంలో  జాతీయ పౌర ప‌ట్టిక సుర‌క్షితం: కేంద్ర హోంశాఖ
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 12 
అస్సాంలో  జాతీయ పౌర ప‌ట్టిక కోసం సేక‌రించిన డేటా సుర‌క్షితంగా ఉంద‌ని కేంద్ర హోంశాఖ ఇవాళ స్ప‌ష్టం చేసింది.  క్లౌడ్ స్టోరేజ్‌లో వ‌చ్చిన విజిబులిటీ సాంకేతిక స‌మ‌స్యను ప‌రిష్క‌రించామ‌ని ఆ శాఖ ప్ర‌తినిధి తెలిపారు.  గ‌త ఏడాది ఆగ‌స్టు 31న‌,  సదరు  వెబ్‌సైట్‌లో ఎన్ఆర్సీ డేటాను అప్‌లోడ్ చేశారు.  3.4 కోట్ల జ‌నాభా నుంచి సుమారు 19 ల‌క్ష‌ల మంది తుది జాబితాలో స్థానం కోల్పోయిన విష‌యం తెలిసిందే.  క్లౌడ్ ఫ్లాట్‌ఫాంలో డేటాను స్టోర్ చేసేందుకు ఐటీ సంస్థ విప్రోకు కాంట్రాక్టు ఇచ్చారు. గ‌త అక్టోబ‌ర్‌లో ఆ సంస్థ‌తో కాంట్రాక్టు ముగిసింది. అయితే ఎన్ఆర్సీకి కొత్త కోఆర్డినేట‌ర్ రావ‌డం వ‌ల్ల ఇంకా డేటా స్టోరేజ్ రెన్యూవ‌ల్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌లేద‌న్నారు.  ఎన్ఆర్సీ డేటా ఆఫ్‌లైన్ కావ‌డం వ‌ల్ల అస్సాంలో ఆందోళ‌న  మొద‌లైంది. డేటా గ‌ల్లంతు అయిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌తిప‌క్షాలు దీన్ని ప్ర‌శ్నించాయి.  కావాల‌నే బీజేపీ ఎన్ఆర్సీ డేటాను ప‌క్క‌న‌పెట్టింద‌ని కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్ ఆరోపించారు.

Related Posts