ఆంగ్ల బోధనపై మంచి స్పందన
అమరావతి ఫిబ్రవరి 12
ప్రైవేటు విద్యాసంస్థలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి అందరి ఆమోదం ఉందా అని చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారని విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంత్రి మాట్లాడుతూ వారికి సమాధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ని తల్లిదండ్రుల కమిటీలు తమ అంగీకారాన్ని తెలియ చేస్తూ తీర్మానం చేశాయి. 45 వేల పై చిలుకు పాఠశాలల నుంచి ఈ తీర్మానాలు వచ్చాయి. ఆంగ్ల మాధ్యమం గురించి అంతా సానుకూలంగా నే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం తో అంతా ఏకీభవిస్తూ, స్వాగతిస్తున్నామని చెప్పి తీర్మానాలు చేశారు. ఇందులో చదువుకున్నవాళ్ళు, చదువులేని వాళ్ళు అంతా సానుకూలంగా స్పందించారు. ఆంగ్ల మాధ్యమం లో బోధన జరగలన్నదే వారి ఏకాభిప్రాయం గా ఉంది. ఆ తీర్మానాలను అన్ని సచివాలయంలో ప్రదర్శన కు పెట్టామని అన్నారు. చంద్రబాబు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి మళ్ళీ యూ టర్న్ తీసుకున్నారు. ఆయన నియోజకవర్గంలోని కుప్పం మండలంలో ఉన్న 140 పాఠశాలల్లో తీర్మానం చేశారని మంత్రి అన్నారు.