YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

భరోసా కోసమే  కార్దన్ సర్చ్

భరోసా కోసమే  కార్దన్ సర్చ్

భరోసా కోసమే  కార్దన్ సర్చ్
-జిల్లా ఎస్పీ 
నిర్మల్ ఫిబ్రవరి 12 
బుధవారం నాడు కడ్తాల్ గ్రామలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కొరకు కార్దన్ సర్చ్ కార్యక్రమాన్ని పోలీసలు నిర్వహించారు.  ఈ తనీఖీల్లో ఎలాంటి దృవీకరణ పత్రాలు లేని 83 ద్వీచక్ర వాహనాలతో పాటు 03 ఆటో రిక్షాలను, 13,350/- అనుమతి లేని మద్యం, స్వాధీనం చేసుకున్నారు.  యూపీ రాష్ట్రానికి చెందిన ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ  సందర్భంగా ఎస్పీ శశిధర్ రాజు  గ్రామా ప్రజలతో మాట్లాడుతూ శాంతి భద్రతలపై ప్రజలకు బారోసా కల్పించడంతో పాటు, నేరాల నియంత్రణ, నిందితుల గుర్తించడం కోసం ఈ కార్దన్ సర్చ్ నిర్వహించడం  జరుగుతుందని అన్నారు. పట్టణ, గ్రామాల పరిధిలో నిరందతరం  నిఘా కోసం బ్లూ కోల్ట్స్ మరియు పెట్రో కార్ బృందాలను ప్రారంభించడం జరిగింది. ఈ బృందాల ద్వారా ప్రజల భద్రత కోసం నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు నేరస్తుల కదలికపై నిఘా కొనసాగించడం జరుతుందని తెలియజేయడంతో పాటు, పటిష్టమైన నేర నివారణ చర్యలలో భాగంగా గ్రామంలో అందరూ కలిసి ముఖ్య కూడలిల్లో సి‌సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎలాంటి అత్యవసర సమయములో అయిన డైల్ 100 కు గాని, సమీప పోలీస్ స్టేషన్ కు గాని సమాచారము అంధించాలని సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడును అని అన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాలను అధిక  వేగంగా నడిపి ప్రమాదాలకు కారకులుగా మారవద్దని సలహా ఇచ్చారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఓవర్ స్పీడ్ గా వెళ్లడం, ముందు,వెనుక వాహనాలను చూసుకోకుండా ఓవర్ టెక్ చేయడం మంచిది కాదని, రోడ్డు మీదకి వచ్చినపుడు వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరగకుండా వుండేదుకు రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్  రూల్స్ సంబంధించిన సూచనలు తెలిపినారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదు, ఏదైనా పరిణామ జరిగినపుడు కుటుంబ పెద్ద దిక్కు లేని లోటు ఏర్పడుతుంది, ప్రతి ఒక్కరు హెల్మెట్ తీసుకోవాలని అన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు.

Related Posts