YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు...!

ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు...!

ముంబై : రవాణ శాఖాధికారులు కొత్త రవాణ వాహనాలను పరీక్షించకుండానే వాహనం తయారీ సర్టిఫికెట్ ఆధారంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

వాహనాలను పరీక్షించకుండానే ట్రాన్స్ పోర్టు వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. 

వాహనాల తయారీ సంస్థ జారీ చేసిన సర్టిఫికెట్ ఆధారంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని, ఇంకా వాహనాలను పరీక్షించడం ఎందుకని మహారాష్ట్ర సర్కారు చేసిన వాదనను హైకోర్టు జడ్జీలు జస్టిస్ అభయ్ ఒకా, రియాజ్ చాగ్లాలు తోసి పుచ్చారు. 

వాహనాలను రవాణ శాఖాధికారులు తప్పనిసరిగా పరీక్షించిన తర్వాతే వాటికి ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేలా ఉత్తర్వులు జారీ చేసి, దీనిపై ఏప్రిల్ 25వతేదీలోగా తమకు సమాచారం అందించాలని జడ్జీలు ఆదేశించారు. 

వాహనాలను పరీక్షించకుండానే ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని శ్రీకాంత్ కార్వే వేసిన పిటిషనుపై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 

వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే ముందు వాహన తనిఖీలు తప్పనిసరి అని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది.

Related Posts