YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మోడీతో జగన్ భేటీ

మోడీతో జగన్ భేటీ

మోడీతో జగన్ భేటీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధనే ఎజెండాగా సీఎం జగన్‌ ....ప్రధానితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం కూలంకుషంగా చర్చించనున్నారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం సీఎం జగన్‌ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించనున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన రూ.3,800 కోట్లకుపైగా నిధులను విడుదల చేయాల్సిందిగా మోదీని సీఎం కోరనున్నారు.ఇక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, గోరంట్ల మాధవ్‌ , మార్గాని భరత్‌, నందిగం సురేష్‌, శ్రీకృష్ణ దేవరాయలు, రెడ్డప్ప, బల్లి దుర్గాప్రసాద్‌, చింతా అనురాధ, వంగా గీత, భీశెట్టి వెంకట సత్యవతి తదితరులు ఉన్నారు.

Related Posts