YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల నిర్వహణకు ఈసీ రెడీ

ఎన్నికల నిర్వహణకు ఈసీ రెడీ

ఎన్నికల నిర్వహణకు ఈసీ రెడీ
విజయవాడ, ఫిబ్రవరి 13,
స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తుది తీర్పు వెలువడగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ రామసుందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పందించారు స్థానిక ఎన్నికలు(కార్పొరేషన్, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల)కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికలను పేపర్‌ బ్యాలెట్‌లోనే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీలో 1,5732 బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉన్నాయని, కేరళ,  తమిళనాడు, రాష్ట్రాల నుంచి 13, 227 బ్యాలెట్ బాక్సులను తెప్పించామని తెలిపారు.ప్రస్తుతం 1,18,959 బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉంచామని, తెలంగాణ రాష్ట్రం నుంచి 40 వేల బ్యాలెట్ బాక్స్లు ఇచ్చేందుకు అనుమతించారని పేర్కొన్నారు. సర్పంచ్, ఎం.పి.టి.సి ఎన్నికలకు పింక్ కలర్ పేపర్, మున్సిపాలిటీ జెడ్పీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికలకు వైట్ కలర్ పేపర్ ఉపయోగిస్తామని అన్నారు. పంచాయితీ ఎన్నికలను రాజకీయ పార్టీల రహితంగా ఫ్రీ సింబల్స్ ఉపయోగిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు కావాల్సిన సామగ్రి సిద్ధంగా ఉందన్నారు.మార్చి పదిహేనవ తేదీ లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందుకోసం కఠిన చట్టాలను తెస్తూ చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదించింది. పంచాయతీ రాజ్ చట్టంలో కీలక సవరణలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. నగదు, మద్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయంచింది. అభ్యర్థి ఎవరైనా నగదు, మద్యం పంచుతూ దొరికితే వెంటనే అనర్హత వేటు వేసేలా నిబంధనలను రూపొందించింది. పదమూడు నుంచి 15 రోజులలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సర్పంచ్ ఖచ్చితంగా స్థానికుడై ఉండాలన్న నిబంధనను విధించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఐదు రోజులు, పంచాయతీ ఎన్నికలకు ఏడు రోజులు మాత్రమే ప్రచారం ఉండేలా రూపొందించిన నిబంధనలకు మంత్రి వర్గ ఆమోదం తెలిపింది. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Related Posts