YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 ప్రశాంత్ కిషోర్ పాపులారిటీ... సూపర్

 ప్రశాంత్ కిషోర్ పాపులారిటీ... సూపర్

 ప్రశాంత్ కిషోర్ పాపులారిటీ... సూపర్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13,
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సక్సెస్ రేటు పెరిగింది. ఏడాదిలోనే రెండు అపూర్వ విజయాలు. దీంతో ఆయనకు రాజకీయా పార్టీల నుంచి బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. వరసగా ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నారు. జాతీయ పార్టీలను పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలను గద్దెనెక్కించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ముందు రెండు లక్ష్యాలున్నాయి. ఈ రెండింటింలో విజయం సాధిస్తే ప్రశాంత్ కిషోర్ దేశ రాజకీయాల్లో మెస్ట్ వాంటెడ్ స్ట్రాటజిస్ట్ గా మారతారనడంలో ఎటువంటి సందేహం లేదు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ విజయానికి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలు ఉపయోగపడ్డాయి. జగన్ పాదయాత్ర డిజైన్ మొదలు నుంచి అభ్యర్థుల ఎంపిక వరకూ ప్రశాంత్ కిషోర్ డిసైడ్ చేశారు. ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశాంత్ కిషోర్ టీం జనంలోకి పంపింది. ఒక్క ఛాన్స్ ఇవ్వరూ అంటూ జగన్ చేత పలికించి చివరకు అదే నిజం చేశారు. వైసీపీకి 151 సీట్లు వచ్చాయంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహమే కారణమన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.ఇక తాజాగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. బీహార్ లో జేడీయూ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నా, తాను అందులో ఉపాధ్యక్ష పదవిలో ఉన్నా ఆయన ఏమాత్రం సందేహించకుండా ఆప్ కు తన వ్యూహాన్ని అందించారు. ఫలితంగా కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబోతున్నారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ప్రశాంత్ కిషోర్ టీం ఎ్పటికప్పడు వాటిని చిత్తు చేయడం వల్లనే 62 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కాయి.ప్రశాంత్ కిషోర్ ముందున్న లక్ష్యం ఇప్పుడు బీహార్. బీహార్ లో తనను బయటకు పంపిన జేడీయూ, బీజేపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నారు. ఆయన ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని బీహార్ బరిలో దించి నితీష్ పార్టీని దెబ్బతీయాలన్న వ్యూహంలో ఉన్నారు. ఈఏడాది బీహార్ ఎన్నికలు జరగనుండటంతో ప్రశాంత్ తన శక్తియుక్తులన్నీ అక్కడే పెట్టనున్నారు. బీహార్ తో పాటు పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీకి కూడా ప్రశాంత్ కిషోర్ సాయాన్ని అందిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ వర్క్ అవుట్ అయితే ఇక ఆయనకు దేశ రాజకీయాల్లో తిరుగుండదన్నది వాస్తవం.

Related Posts