సింగపూర్ లో ఆరెంజ్ అలెర్ట్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13,
కరోనా వైరస్ నేపథ్యంలో సింగపూర్‌లో కండోమ్‌లకు కొరత ఏర్పడిదంట. అదేంటీ? కరోనా వైరస్‌కు, కండోమ్‌లకు సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? లేదా అంత భయానక పరిస్థితుల్లోనూ వారికి సెక్స్ మీద ఆశ తగ్గడం లేదా అని సందేహిస్తున్నారా? అలాంటి అనుమానాలేమీ పెట్టుకోకండి. ఆ కండోమ్‌లను వాడుతున్నది ఆ పని కోసం కాదు, కరోనా వైరస్ నుంచి ‘సేఫ్టీ’ కోసం.కరోనా వైరస్ నేపథ్యంలో సింగపూర్‌లో ఫిబ్రవరి 7వ తేదీన డిసీజ్ ఔట్‌బ్రేక్ రెస్పాన్స్ సిస్టమ్ కండీషన్ (డార్సకాన్ )గా కింద ఆరెంజ్ లెవల్ అలర్ట్ ప్రకటించారు. కోవిద్ -19 అనే ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పటికే చైనాలో వందలాది మంది ప్రాణాలు వదిలారు. ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు.సింగపూర్‌లో ముందు జాగ్రత్తగా ప్రజలు మెడికల్ ఫేస్ మాస్కులు, గ్లవ్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మెడికల్ షాపుల్లో వాటికి భారీగా కొరత ఏర్పడింది. డిమాండుకు తగిన సంఖ్యలో మాస్కులు లేకపోవడంతో ప్రజలు ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వాటికి ప్రత్యామ్నయంగా హ్యండ్ శానిటైజర్లు, టిష్యులు, కండోమ్‌లను కొనుగులు చేస్తున్నారు. కండోమ్‌లను సెక్స్ కోసం కొనుగోలు చేస్తున్నారని అనుకుంటే పొరపాటే. ఇందుకు వేరే కారణం ఉంది.కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే చేతికి గ్లవ్స్ ధరించడం కూడా ఎంతో ముఖ్యం. ఆ వైరస్ చాలా శక్తివంతమైనది కావడంతో వస్తువులను ముట్టుకున్న సరే సోకే ప్రమాదం ఉంది. ఓ వ్యక్తి లిఫ్ట్ బటన్ నొక్కేందుకు వేలుకు కండోమ్ తొడిగాడు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఐడియా బాగా నచ్చేయడంతో జనాలు కండోమ్‌లు కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా సింగపూర్‌లో కండోమ్‌లకు కొరత ఏర్పడింది.