YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రాశి ఫలాలు..

Highlights

  • శుభమస్తు
  • తేది :  29-03-2018, గురువారం
రాశి ఫలాలు..

మేషం: విదేశాలకు వెళ్లేందుకు చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. స్త్రీలకు షాపింగ్‌ల్లోను, వస్తు నాణ్యత ఎంపికలోను ఏకాగ్రత అవసరం. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటుంది. దైవ, సేవాకార్యాల పట్ల ఆకర్షితులవుతారు. ధనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

వృషభం: కోర్టు వ్యాజ్యాలు, కేసులు ఉపసంహరించుకుంటారు. వ్యాపారాల్లో ఆటుపోటులు తొలగి లాభాలు గడిస్తారు. బంధువులకు ధన సహాయం చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు కొంతమంది ఆటంకాలు కలిగిస్తారు. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో ఏకాగ్రత వహించండి.

మిథునం: ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. సోదరీ, సోదరులు సన్నిహితులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్లీడరు ప్లీడరు గుమస్తాలకు ప్రోత్సాహం కానరాగలదు. నూనె మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి.

కర్కాటకం: కాంట్రాక్టర్లు, నూతన కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. రాజకీయాల్లో వారికి గుర్తింపుతో పాటు చికాకులు కూడా అధికం. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయడం మంచిది. పాత మొండి బాకీలు వసూలు కాగలవు.

సింహం: వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి లాభదాయకం. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు అధికమవుతాయి. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, అధికమవుతుంది.

కన్య: మీ శ్రమను దుర్వినియోగం చేయకండి. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. శాస్త్ర రంగాల వారికి పరిశోధనలు ప్రయోగాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కీలకమైన సమస్యలు పరిష్కారం కావడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పత్రికా సంస్థల్లోని వారికి ఊహించని సమస్యలెదురవుతాయి.

తుల: రవాణా, న్యాయ, ప్రకటనలు, విద్యారంగాల వారికి శుభప్రదం. ఒకానొక సందర్భంలో మీ ఆవేశపూరిత నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. ఉపాధ్యాయులకు మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతాయి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. పాత వస్తువుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి.

వృశ్చికం: అందివచ్చిన అవకాశం చేజారినా మంచికేనని భావించండి. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం.

ధనస్సు: రావలసిన బకాయిల విషయంలో శ్రద్ధ వహించండి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొనవలసివస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రయ విక్రయాల విషయంలో శ్రేయోభిలాషుల సలహా పాటించడం మంచిది.

మకరం: బంధువర్గాల నుంచి వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. కాంట్రాక్టర్లకు పనివారలతో సమస్యలు అధికమవుతాయి.

కుంభం: ఏజెన్సీలు, లీజు, గడువు పొడిగింపులకు అనుకూలం. తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవడం క్షేమం కాదు. విద్యార్థినుల్లో ఏకాగ్రత, స్థిరత్వం నెలకొంటాయి. బంధువుల రాక వల్ల పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. ఏజెన్సీ, లీజు, నూతన కాంట్రాక్టులకు సంబంధించి కొన్ని ప్రతికూలతలెదురవుతాయి.

మీనం: ఆధ్యాత్మిక విషయాలు, దానధర్మాలకు ఖర్చులు చేస్తారు. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. పాత రుణాలు తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు శుభదాయకం

Related Posts