ఈ ఏడాది భారీగా పెరిగిన వరి
నిజామాబాద్, ఫిబ్రవరి 13,
రబీ సీజన్‌లో ఒక వరి సాగు తప్పా ఇతర అన్ని పంటల విస్తీర్ణం తగ్గింది. ఈ సీజన్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 3.25 లక్షల హెక్టార్లు అయితే ప్రస్తుతం సాగైంది 6 లక్షల హెక్టార్లు. రబీ సీజన్ సాగు విస్తీర్ణం 12.77 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు సాగైంది 10.83 లక్షల హెక్టార్లు మాత్రమే. గత ఏడాది ఇదే సమయానికి 11.51 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది మిర్చికి, కందులకు ధర రాకపోవడంతో ఈ ఏడాది ఆ పంటల జోలికి వెళ్లలేదని తెలు స్తోంది. గత సంవత్స రం కందులు క్వింటాలుకు పెరిగిన వరి సాగురూ.3500 మించి ధర పలకలేదు. మిర్చి పరిస్థితి కూడా అంతే. మిర్చి కొనుగోలు చేసే వారు లేకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మంలో క్యూలో నిలబడే పరిస్థితి వచ్చింది. ఈ అనుభవంతో రైతులు ఆ పంటలు సాగుకు వెనక్కి తగ్గిండొచ్చని అధికారులు తెలిపారు. వేరుశనగ, ఉలవలు, ఆవాల పంటలు గత సంవత్సరంతో పోలిస్తే ఏ మాత్రం పెరగలేదు.
పంటలు 2018 2019 (లక్షల హెక్టార్లలో)
గోధుమ 0.2 0.2
జొన్న 0.21 0.23
మొక్కజొన్న 1.49 1.32
కంది 0.2 0.1
శనగలు 1.39 1.02
పెసర 18 0.7
మినుములు 18 0.8
పొద్దుతిరుగుడు 0.8 0.3