YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 కర్నాటకలో బంద్…ఉద్రిక్తత

 కర్నాటకలో బంద్…ఉద్రిక్తత

 కర్నాటకలో బంద్…ఉద్రిక్తత
బెంగళూరు  ఫిబ్రవరి 13
కర్ణాటక బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది.కర్ణాటకలో కన్నడిగులకే ఉద్యోగాలు ఇవ్వాలని, సరోజిని మహిషి వరది కమిటీ నివేదిక ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక బంద్ కు  కొనసాగుతోంది.కర్ణాటక బంద్ కు 600 సంఘ, సంస్థలు మద్దతు ప్రకటించాయి.ఇప్పటికే కన్నడ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బెంగళూరు మౌర్య సర్కిల్ లో నిరంతరంగా ధర్నాలు కొనసాగుతున్నాయి. కన్నడ సంఘాలు చేస్తున్న ధర్నాలు 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చాయి. బస్సులపై ఆందోళనకారులు దాడి చేసే అవకాశంఉన్న నేపథ్యంలో ముందుగానే బస్సులను  నిలిపివేశారు.అయితే ఆంధ్రా బస్సులను టార్గెట్ చేసి రాళ్ల దాడి చెయ్యడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.తిరుపతి వెళ్లే బస్సుపై రాళ్ల దాడి చేశారు. ఫరంగిపెటె ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు బంద్ కారణంగా కర్ణాటక యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. ప్రభుత్వ,ప్రైవేట్ సెక్టార్లలో 75శాతం ఉద్యోగాలు కన్నడిగ యువతకే ఇవ్వాలని కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts