YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

 శ్రీగిరిపై ఔటర్ రింగ్ రోడ్డు 

 శ్రీగిరిపై ఔటర్ రింగ్ రోడ్డు 

 శ్రీగిరిపై ఔటర్ రింగ్ రోడ్డు 
16 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు
ఇతర రాష్ట్రాల బస్సులకు ప్రత్యేక బస్టాండ్ 
మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక దృష్టి
కర్నూలు ఫిబ్రవరి 13,
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలానికి భారీగా భక్తులు వస్తారు. రద్దీ ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. భక్తులు వేలాదిగా సొంత, అద్దె వాహనాల్లో వస్తారు. క్షేత్రంలో పార్కింగ్ స్థలం తగినంత లేకపోతే ట్రాఫిక్ సమస్య తలెత్తడం తథ్యం. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో ట్రాఫిక్ అధికార యంత్రాంగానికి ఓ ముఖ్యమైన సవాల్. ముందస్తు ఏర్పాట్లు, నిర్ణయాలు లేకపోతే క్షేత్రం పద్మవ్యూహంలా మారే ప్రమాదం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులు నానా అవస్థలు పడేవారు. రెండేళ్ల కింద క్షేత్రంలో ఔటర్రింగ్రోడ్డు వేయడంతో వాహనాలు క్షేత్రంలోకి రాకుండా నేరుగా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా  పార్కింగ్ స్థలాల వద్దకు చేరుకుంటున్నాయి. ఈ అనుభవంతో ఈ ఏడాది కూడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. 
గత మహాశివరాత్రి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా దేవస్థానం, రవాణశాఖ, పోలీసులు సమన్వయంతో సమస్యను అధిగమించేలా ప్రణాళికలు తయారు చేశారు. క్షేత్రంలో వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులకు 8 చోట్ల, లైట్ వెహికల్స్కు 8 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాట్లు చేశారు. సుమారు 30వేల వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు.
మహాశివరాత్రికి ఇతర రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. ఈ బస్సులకు ఫిల్టర్హౌస్ వద్ద, ప్రైవేట్ బస్సులకు టూరిస్టు బస్టాండ్ వద్ద ప్రత్యేకంగా బస్టాండ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ నుంచి వచ్చే ప్రత్యేక సర్వీసులకు శ్రీశైలం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేశారు. ఏయే వాహనాలు ఎక్కడికి వెళ్లాలో రూట్ తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భక్తులకు కూడా అవగాహన కోసం క్షేత్రంలో వివిధ ప్రదేశాల్లో సూచికబోర్డులు ఏర్పాటు చేస్తూ బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు క్షేత్రంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్టాండ్, టూరిస్టు బస్టాండ్, శ్రీశైలం బస్టాండ్ వద్ద తాగునీరు, షామియానాలు, భక్తులకు వాహనాల గురించి సమాచారం తెలిపేలా కంట్రోలర్, టాయిలెట్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు పార్కింగ్ ప్రదేశాల నుంచి, బస్టాండ్ల నుంచి క్షేత్రానికి చేరుకునేందుకు ఉచిత బస్సు సర్వీసు తిప్పితే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు.  శ్రీశైలం  మల్లికార్జున స్వామి ని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో.. ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి కావడం సంతోషదగ్గ విషయంఅని పలువురు భక్తులు  అంటున్నారు.

Related Posts