అవగాహన అప్రమత్తతో వ్యాధులకు దూరం కండి
కరోనా వైరస్ కు ముందస్తుగా హోమియో మందుల పంపిణీ
నెల్లూరు ఫిబ్రవరి 13,
ప్రతి ఒక్కరూ వ్యాధుల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉంటే వ్యాధులు దరిచేరవని నిత్య వాణి పౌండేషన్ కార్యదర్శి బొప్పూరు విజయ్ మోహన్ రావు, కోరారు. నగరంలోని స్థానిక దర్గామిట్ట సెంటర్ నందు గల గిరిజన బాలికల ప్రాథమికోన్నత పాఠశాల లోని విద్యార్థులకు కరోనా వైరస్ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా నిత్య వాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాధి పట్ల అవగాహన కల్పించి అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. హోమియో వైద్యులు డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత ,పరిసరాల పై దృష్టి సారించాలని ఈ కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఆమె కోరారు .అనంతరం ఆర్సనిక్ ఆల్బమ్ 30 హోమియో మందులను పంపిణీ చేశారు .ఈ మందులను మూడు రోజులపాటు వేసుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో సర్వేపల్లి గిరిజన బాలికల ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపాల్ కె విజయలక్ష్మి నిత్య వాణి పౌండేషన్ ఎన్ రవికుమార్, ఉపాధ్యాయులు కిరణ్, కళ్యాణి ,భారతి తదితరులు పాల్గొన్నారు.